AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మిస్టర్‌ కూల్‌ ధోని ఈ ఫొటోలో ఉన్నాడు.. గుర్తు పట్టగలరా.? ఓసారి ప్రయత్నించండి చూద్దాం.

Viral Photo: భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో మిస్టర్‌ కూల్‌ ధోని మొదటి వరుసలో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించి...

Viral Photo: మిస్టర్‌ కూల్‌ ధోని ఈ ఫొటోలో ఉన్నాడు.. గుర్తు పట్టగలరా.? ఓసారి ప్రయత్నించండి చూద్దాం.
Dhoni
Narender Vaitla
|

Updated on: Jul 08, 2021 | 5:18 PM

Share

Viral Photo: భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వారిలో మిస్టర్‌ కూల్‌ ధోని మొదటి వరుసలో ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. అతి తక్కువ కాలంలోనే టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలను స్వీకరించి తన సత్తా చాటాడు ధోని. మ్యాచ్‌ చివరి క్షణం వరకు క్రీజులో నిలిచి.. ఓటమి అంచున ఉన్న జట్టును గెలిపించగల సత్తా ధోని సొంతం. ఆయన ఒంటి చేత్తో గెలిపించిన ఎన్నో మ్యాచ్‌లు దీనికి నిదర్శనం. క్రీజులో ధోని ఉంటే మ్యాచ్‌పై నమ్మకం ఉంటుందన్న భావన క్రికెట్‌ అభిమానుల్లో ఉంటుదనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో.

తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలు అందించిన మిస్టర్‌ కూల్‌ ధోన్‌ జులై 7 (బుధవారం)తో 40వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు హోరెత్తించారు. కేవలం అభిమానులే కాకుండా సెలబ్రిటీలు సైతం ధోనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. ధోని విద్యార్థిగా ఉన్న సమయంలో స్కూల్లో దిగిన గ్రూప్‌ ఫొటోను ఆయన అభిమానులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ గ్రూప్‌ ఫొటోలో ధోని ఎక్కడున్నారో గుర్తు పట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. దీంతో ఆ ఫొటోను గమనిస్తూ ఫ్యాన్స్‌ రకరకలా కామెంట్లు పెడుతున్నారు. మరి ఫ్యాన్స్‌ గుర్తు పట్టిన ఆ చిన్నోడు మన ధోనినేనా..? కాదా.? మీరే తేల్చండి.

Also Read: Tokyo Olympics 2020: ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం.. ఎమర్జెన్సీ దిశగా జపాన్ ప్రభుత్వం..!

278 బంతులు.. 37 పరుగులు.. మరో రాహుల్ ద్రవిడ్ ఈ బ్యాట్స్‌మెన్..! అతడెవరంటే..?

MS Dhoni – CSK: సీఎస్కే ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా మహేంద్రుడే..!