News9 Corporate Badminton 2025: కార్పొరేట్ ఉద్యోగులకు భలే ఛాన్స్.. హైదరాబాద్‌లో TV9 కార్పొరేట్ బ్యాట్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు
News9 Corporate Badminton Championship 2025: దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులకు హైదరాబాద్ వేదికగా న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025ను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులెవరైనా పాల్గొనవచ్చు. వారి వృత్తిపరమైన జీవితాల్లో పెరుగుతున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ టీవీ9 నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ విధానం, కేటగిరీలు, విజేతల ప్రైజ్ మనీ.. ఇతర వివరాలను ఈ కింద చెక్ చేసుకోవచ్చు..

హైదరాబాద్, మే 6: టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా క్రీడా కల్చర్ పెంపొందించడానికి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కార్పొరేట్ ఫుట్‌బాల్ కప్ పోటీలను.. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ పేరిట నిర్వహించింది. ఇక ఈ ఏడాది న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2025ను నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ఉద్యోగులకు అవకాశాన్ని అందిస్తుది. వారి వృత్తిపరమైన జీవితాల్లో పెరుగుతున్న సవాళ్లను అధిగమించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్గజ మాజీ బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ నిర్వహిస్తున్నారు. మే 9 నుండి 11 వరకు హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఎందుకు నిర్వహిస్తున్నారంటే?
నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ ఉద్యోగులు అనేక శారీరక, మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం అందించాలని, వారి ప్రతిభను ప్రదర్శించడానికి చక్కని అవకాశం కల్పించేందుకు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పోటీని నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం కార్పొరేట్ రంగంలో ఆరోగ్యం, కో-ఆపరేషన్ ప్రోత్సహించడం. అంతేకాకుండా న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ అనేది కేవలం ఒక క్రీడా టోర్నమెంట్ మాత్రమేకాదు. ఇది పెరుగుతున్న కార్పొరేట్ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ తోడ్పాటును అందిస్తుంది. తమ సంస్థల బ్రాండ్ విలువలను ప్రదర్శించడానికి, క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, దేశంలోని అగ్ర సంస్థలతో నెట్‌వర్క్‌ను ఏర్పరచుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ ఛాంపియన్‌షిప్.. దేశంలోని ప్రముఖ సంస్థల ఉద్యోగులు తమను తాము రీఛార్జ్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారనుంది.
ఈ పోటీల్లో ఎవరు పాల్గొనవచ్చు?
ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరుగుతుంది. అంటే ప్రతి జట్టు ఇతర జట్టుతో ఆడుతుందన్నమాట. ఈ పోటీల్లో పాల్గొనేవారు ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. రెండు కార్పొరేట్ కంపెనీలు కలిసి ఒక ఉమ్మడి జట్టును ఏర్పాటు చేయవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్, కార్పొరేట్ ఉద్యోగులు, బిజినెస్ లీడర్స్, HR నిపుణులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. అయితే తాము పనిచేసే కార్పొరేట్ సంస్థ ఏర్పాటే కనీసం 2 సంవత్సరాలు పూర్తై ఉండాలి. అలాగే కనీసం పది మంది ఉద్యోగులు ఉండాలి.
ఏయే కేటగిరీలు ఉంటాయంటే?
ఈ టోర్నమెంట్‌లో మెన్ సింగిల్, విమెన్ సింగిల్, మిక్స్‌డ్ డబుల్స్.. బ్యాట్మింటన్ పోటీలు జరుగుతాయి. పురుషుల కేటగిరీ కింద 3 నుంచి 5 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు లేదా స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతి కార్పొరేట్ సంస్థ బహుళ జట్లను నమోదు చేసుకోవచ్చు.
బహుమతుల ప్రధానం ఇలా..
ఈ టోర్నమెంట్‌లో గెలిచినవారితోపాటు పాల్గొనేవారికి అద్భుతమైన ప్రయోజనం లభిస్తుంది. బ్యాట్మింటన్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తొలుత పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిపుణులతో రెండు రోజులపాటు శిక్షణ అందిస్తారు. విజేతలకు లక్షల రూపాయల విలువైన అవార్డులు అందిస్తారు. ఫస్ట్ ఫ్రైజర్‌కి రూ.లక్ష 50 వేలు, సెకండ్ ఫ్రైజర్‌కి రూ.లక్ష, థార్డ్ ప్రైజర్‌కి రూ. 50 వేలు చొప్పున బహుమతి ప్రధానం చేస్తారు.
ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
ఆసక్తి కలిగిన వారు www.news9corporatecup.com వెబ్‌సైట్ నుంచి లేదా corporatecup@tv9.comకు మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 9848078649 లేదా 9899102170కి కాల్ చేయవచ్చు.
మరిన్ని స్పోర్ట్స్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




