4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ వరల్డ్ రికార్డ్! 

శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ ఒకేసారి 20 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో మలింగ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ద్వారా ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. ప్రస్తుతం […]

4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ వరల్డ్ రికార్డ్! 
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 7:10 PM

శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ న్యూజిలాండ్‌తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్‌లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో శ్రీలంక వెటరన్‌ పేసర్‌ లసిత్‌ మలింగ ఒకేసారి 20 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో మలింగ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు సాధించడం ద్వారా ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. ప్రస్తుతం మలింగ 21వ స్థానంలో నిలిచాడు. అంతకుముందు 41 స్థానంలో ఉన్న మలింగ.. కివీస్‌పై అద్భుత ప్రదర్శన తర్వాత తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకున్నాడు. నిన్న కివీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించడంతో వన్డేల్లోనూ టీ20ల్లోనూ ఆ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా మలింగా రికార్డు నెలకొల్పాడు.

అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల మార్కును చేరి తొలి బౌలర్‌గా గుర్తింపు సాధించాడు. ఇక అఫ్గాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ తన టాప్‌ ర్యాంకును కాపాడుకున్నాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ మిచెల్‌ సాంత్నార్‌ ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని ఐదో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్‌ టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో నిలిచిన ఏకైక బౌలర్‌ కుల్దీప్‌. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ ఆటగాడు బాబర్‌ అజామ్‌ టాప్‌ను కాపాడుకున్నాడు. అతని తర్వాత స్థానంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండో స్థానానికి చేరగా, కొలిన్‌ మున్రో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్‌ నుంచి కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలు టాప్‌-10లో నిలిచారు. రాహుల్‌7వ స్థానంలో రోహిత్‌ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.

https://twitter.com/avulasunil/status/1169999036985643009

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం