పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేమంటున్న శ్రీలంక ప్లేయర్స్!

పాకిస్థాన్​ టూర్‌ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  భద్రతా కారణాల దృష్ట్యా  కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో […]

పాకిస్థాన్​లో క్రికెట్ ఆడలేమంటున్న శ్రీలంక ప్లేయర్స్!
Lasith Malinga, Dimuth Karunaratne and Angelo Mathews are among the players who pulled out of Sri Lanka's upcoming tour of Pakistan citing security concerns.
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2019 | 6:08 AM

పాకిస్థాన్​ టూర్‌ని క్యాన్సిల్ చేసుకుంది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నెలలో లంక టీం పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. సిరీస్ ఆడేందుకు శ్రీలంక ప్లేయర్లు నిరాకరించారు. ఈ టూర్‌కు దాదాపు 10 మంది క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  భద్రతా కారణాల దృష్ట్యా  కెప్టెన్ లసిత్ మలింగతో సహా 10 మంది ఆటగాళ్లు పాక్​లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ జాబితాలో లంక జట్టు మాజీ సారథులు ఆంజెలో మ్యాథ్యూస్, తిసారా పెరీరా ఉన్నారు.

సెప్టెంబర్ 27 నుంచి పాకిస్థాన్​లో ఆరు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది శ్రీలంక. అక్టోబర్​ 9 వరకు కొనసాగే ఈ పర్యటనలో ఇందులో మూడు వన్డేలు, మూడు టీ 20లు ఉన్నాయి. 2009లో శ్రీలంక క్రికెటర్ల వాహనాలపై ఉగ్రదాడి అనంతరం పాక్​లో అంతర్జాతీయ మ్యాచ్​ ఆడలేదు ఆ దేశం. అప్పటి నుంచి యూఏఈ కేంద్రంగా పాకిస్థాన్ ఇతర దేశాలతో మ్యాచ్​లు ఆడుతుంది.