AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అపశృతి .. కుప్పకూలిన నిర్వాహకుడు..!

Hugh Edmeades: వేలం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అకస్మాత్తుగా వేలం బాధ్యతను నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మిడ్స్..

IPL 2022 Auction: ఐపీఎల్ వేలంలో అపశృతి .. కుప్పకూలిన నిర్వాహకుడు..!
Hugh Edmeades
Venkata Chari
|

Updated on: Feb 12, 2022 | 3:24 PM

Share

IPL Auctioneer Fell Down: ఐపీఎల్ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వేలంలో అనుకోని పరిణామంతో వాయిదా వేశారు. వేలం మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడింది. అకస్మాత్తుగా వేలం బాధ్యతను నిర్వహిస్తున్న హ్యూ ఎడ్మిడ్స్.. వనిందు హసరంగాపై వేలంపాట మధ్య స్పృహ తప్పి పడిపోయాడు. అతను ఆటగాళ్లందరిపై బిడ్లు నిర్వహించే సమయంలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోవడంతో వేలాన్ని ప్రస్తుతానికి నిలిపివేశారు. అటు వేలంపాట పాడే హ్యు ఎడ్మడేస్‌ కూడా వీరిమధ్య మంచి పోటీని రక్తికట్టించారు. అదే సమయంలో ఆయన కళ్లుతిరిగి పడిపోవడంతో.. ఆడిటోరియంలో ఉన్నవారంతా షాకయ్యారు.

వైద్యులు హ్యూ ఎడ్మీడ్స్ పరీక్షించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఆయనకు ప్రత్యామ్నాయంగా చారు శర్మను తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయించింది. చారుకు గతంలో వేలంపాటలు నిర్వహించిన అనుభవం ఉంది. ఈమేరకు బీసీసీఐ అధికారి ట్వీట్ చేశారు. రేపటికి ఎడ్మీడ్స్ అందుబాటులోకి వస్తాడా లేదా అన్నది వైద్యులు సూచించే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.