ఫెదరర్‌కే చుక్కలు చూపించాడు.. భారత ఆటగాడిపై ప్రశంసలు
స్విస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో భారత ఆటగాడు సుమిత్ నగాల్(22)పై 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఆయన విజయం సాధించాడు. అయితే ఈ ఆటలో మొదటి సెట్‌లో సుమిత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు ఫెదరర్. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ఈ హరియాణ ఆటగాడు 6-4తో మొదటి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తరువాత ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ […]
స్విస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో భారత ఆటగాడు సుమిత్ నగాల్(22)పై 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఆయన విజయం సాధించాడు. అయితే ఈ ఆటలో మొదటి సెట్‌లో సుమిత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు ఫెదరర్. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ఈ హరియాణ ఆటగాడు 6-4తో మొదటి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తరువాత ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ ఓడిపోక తప్పలేదు. ఏది ఏమైనా అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్రపంచ దిగ్గజంతో పోటీ పడి అదరగొట్టాడని అభిమానులు సుమిత్‌ను పొగిడేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సుమిత్ మంచి ఆటగాడు అవుతాడంటూ ప్రశంసించడం మరో విశేషం.