మహిళల ఫుట్‌బాల్‌ టీంకు ఒలింపిక్ ఆశలు గల్లంతు

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనుకున్న భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఆశలు ఆవిరి అయ్యాయి. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. మంగళవారం మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగిసింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఒలింపిక్స్ అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయింది మహిళల జట్టు. గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిస్తే భారత్‌కు ఒలింపిక్ అవకాశాలు ఉండేవి. అయితే ఈ గ్రూప్‌లో […]

మహిళల ఫుట్‌బాల్‌ టీంకు ఒలింపిక్ ఆశలు గల్లంతు

Edited By:

Updated on: Apr 10, 2019 | 7:52 PM

వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనుకున్న భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు ఆశలు ఆవిరి అయ్యాయి. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ మూడో దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు విఫలమైంది. మంగళవారం మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌ 3-3తో డ్రాగా ముగిసింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు ఒలింపిక్స్ అవకాశాలు కూడా పూర్తిగా కోల్పోయింది మహిళల జట్టు. గ్రూప్ ‘ఎ’లో టాపర్‌గా నిలిస్తే భారత్‌కు ఒలింపిక్ అవకాశాలు ఉండేవి. అయితే ఈ గ్రూప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి 7పాయింట్లతో భారత్, మయన్మార్ సమంగా ఉన్నా.. గోల్స్ తేడాతో మయన్మార్ అగ్రస్థానం సాధించింది. దీంతో భారత జట్టు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.