IND vs ENG 2nd ODI: రోహిత్ సెంచరీ ఇన్నింగ్స్.. కటక్ వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ మనదే
రెండో వన్డేలోనూ భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు ఇచ్చిన 305 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని ఛేదించింది. భారత జట్టు తరుపున రోహిత్ శర్మ 119 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 44, కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10, విరాట్ కోహ్లీ 5, శుభ్‌మాన్ గిల్ 60 పరుగులు చేసి ఔటయ్యారు. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్ చెరో వికెట్ తీశారు.

India vs England, 2nd ODI: రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో, భారత జట్టు 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. కటక్‌లోని బారాబాటి స్టేడియంలో ఆదివారం ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 119 పరుగులు చేసి తన 32వ వన్డే సెంచరీని సాధించాడు. శుభమన్ గిల్ 60 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున జో రూట్ 69, బెన్ డకెట్ 65 పరుగులు చేశారు. జేమీ ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టాడు. మూడో వన్డే ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
2ND ODI. India Won by 4 Wicket(s) https://t.co/NReW1eEQtF #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 9, 2025
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, మార్క్ వుడ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..