శార్దూల్, సుందర్‌ల రికార్డు భాగస్వామ్యం.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 ఆలౌట్.. ఆసీస్‌కు 54 పరుగుల ఆదిక్యం..

India Vs Australia 2020: గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి...

  • Ravi Kiran
  • Publish Date - 1:37 pm, Sun, 17 January 21
శార్దూల్, సుందర్‌ల రికార్డు భాగస్వామ్యం.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 ఆలౌట్.. ఆసీస్‌కు 54 పరుగుల ఆదిక్యం..
India Vs Australia

India Vs Australia 2020: గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్(20), హారిస్(1)లు క్రీజులో ఉన్నారు.

అంతకముందు 62/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్.. 111.4 ఓవర్లకు 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో రహనే(37), అగర్వాల్(38) రాణించగా.. వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67) వీరోచిత అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

ఆసీస్ బౌలర్లలో హెజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు.. లియోన్ ఒక వికెట్ తీశారు. ఇక నాలుగో రోజు కూడా ఆట గంట ముందే ప్రారంభమవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.