సఫారీలపై విజయంతో… టీమిండియా వరల్డ్ రికార్డ్!
పుణేలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును సృష్టించింది. స‍్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించిన తర్వాత భారత్‌కు ఇది వరుసగా 11వ స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస […]
పుణేలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా టీమిండియా కొత్త రికార్డును సృష్టించింది. స‍్వదేశీ వరుస టెస్టు సిరీస్ విజయాల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకింది. సఫారీలతో టెస్టు సిరీస్‌ను సాధించిన తర్వాత భారత్‌కు ఇది వరుసగా 11వ స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయం. ఈ క్రమంలోనే ఆసీస్ రికార్డును టీమిండియా బద్ధలు కొట్టింది. 1994-95 సీజన్ మొదలు కొని 2000-01 సీజన్ వరకూ ఆసీస్ తమ దేశంలో సాధించిన వరుస టెస్టు సిరీస్ విజయాలు సంఖ్య 10
ఆపై 2004-09 సీజన్ మధ్యలో ఆసీస్ మరోసారి 10 వరుస స‍్వదేశీ టెస్టు సిరీస్ విజయాలు సాధించింది. అయితే ఆసీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా తాజాగా బ్రేక్ చేసింది. 2012-13 సీజన్ నుంచి ఇప్పటివరకూ భారత్ వరుసగా 11 స్వదేశీ టెస్టు సిరీస్ విజయాల్ని నమోదు చేసింది. ఫలితంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ జాబితాలో టీమిండియా, ఆసీస్‌ల తర్వాత స్థానంలో వెస్టిండీస్ ఉంది. 1975-76 సీజన్ నుంచి 1985-86 సీజన్ వరకూ వెస్టిండీస్ తమ సొంత గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టు సిరీస్ విజయాలు సాధించింది.