ఆ విష‌యంలో ధోనీ నన్ను టీజ్ చేస్తాడు : ఇషాంత్

ఇండియా ఫాస్ట్ బౌలర్​ ఇషాంత్​ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలో తన ఏజ్ కు సంబంధించి.. శ్రీమ‌తి ప్రతిమతో పాటు, మాజీ కెప్టెన్​ ధోనీ ఎలా ఆటపట్టిస్తాడో వివ‌రించాడు.

ఆ విష‌యంలో ధోనీ నన్ను టీజ్ చేస్తాడు : ఇషాంత్

Ishant Sharma about dhoni : ఇండియా ఫాస్ట్ బౌలర్​ ఇషాంత్​ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలో తన ఏజ్ కు సంబంధించి.. శ్రీమ‌తి ప్రతిమతో పాటు, మాజీ కెప్టెన్​ ధోనీ ఎలా ఆటపట్టిస్తారో వివ‌రించాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపాడు.

“నిజానికి మెంట‌ల్ గా 32ఏళ్ల కంటే ఎక్కువగా పెరిగా. నా శ్రీమ‌తి ఎప్పుడూ నన్ను ఓల్డ్​ అంటూ పిలుస్తుంది. ఇక మాహీ అన్న‌​ అయితే, ఎలా ఉన్నావ్ పెద్దాయన? అని ఆట‌ప‌ట్టిస్తాడు. ​నీ ఏజ్ 32 ఏళ్లు మాత్రమే.. కానీ 52 ఏళ్లలా ఎదిగావు.. అంటూ స‌రదాగా టీజ్ చేస్తాడు” అని ఇషాంత్​ శర్మ పేర్కొన్నాడు.

2007లో క్రికెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన‌ ఇషాంత్​.. ధోనీతో మంచి స్నేహంగా మెలిగాడు. ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్​ అనుభవాన్ని బ‌ట్టి చూస్తే.. ఇషాంత్​కు ధోనీ మూడేళ్లు సీనియర్​. టీమ్​ఇండియా తరఫున ఎక్కువ కాలం కలిసి ఆడిన వీరిద్దరి మధ్య స్నేహ బంధం కూడా బలంగా ఉంది.  ఇక‌ టెస్టు క్రికెట్​లో మరో మూడు వికెట్లు తీస్తే.. 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్​గా క్రేజీ రికార్డు అందుకోనున్నాడు ఇషాంత్​.

 

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

Click on your DTH Provider to Add TV9 Telugu