దేశానికి చాలా బహుమతులిచ్చావ్‌ – ప్రధాని మోడీ

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రధాని మోడీకి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో వీడియో పెట్టారు. ఇందులో ఆమె ప్రధానికి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు వచ్చే ఏడాది ఈ సమయానికి ఒలింపిక్స్‌ పతకాలు సాధించి దేశానికి మంచి బహుమతి ఇస్తాను......

దేశానికి చాలా బహుమతులిచ్చావ్‌ - ప్రధాని మోడీ

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ప్రధాని మోడీకి రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్‌లో వీడియో పెట్టారు. ఇందులో ఆమె ప్రధానికి శుభాకాంక్షలు తెలుపడంతోపాటు వచ్చే ఏడాది ఈ సమయానికి ఒలింపిక్స్‌ పతకాలు సాధించి దేశానికి మంచి బహుమతి ఇస్తాను అని హామీ ఇచ్చారు.

అయితే.. దేశ క్రీడాకారులతో తరుచూ సంభాషించే మోడీ దీనిపై స్పందించారు. ‘రక్షా బంధన్ శుభాకాంక్షలు @ పీవీ సింధు1(@Pvsindhu1). మీరు ఇప్పటికే దేశానికి చాలా బహుమతులు ఇచ్చారు. రాబోయే కాలంలో మీరు రాణించగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ వ్యక్తి మీరు.’ అని రీట్వీట్‌ చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu