AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లీ-రవిశాస్త్రిల‌ సక్సెస్ సీక్రెట్ అదే : ఆశిష్ నెహ్రా

భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్ర‌ధాన‌ కోచ్ రవిశాస్త్రిల మైండ్ సెట్స్ ఒకేలా ఉండ‌ట‌మే వారి విజ‌యాల‌కు కారణమని భార‌త‌ మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు.

కోహ్లీ-రవిశాస్త్రిల‌ సక్సెస్ సీక్రెట్ అదే : ఆశిష్ నెహ్రా
Ram Naramaneni
|

Updated on: Aug 04, 2020 | 9:46 PM

Share

Ashish Nehra Latest Comments On Kohli : భార‌త కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్ర‌ధాన‌ కోచ్ రవిశాస్త్రిల మైండ్ సెట్స్ ఒకేలా ఉండ‌ట‌మే వారి విజ‌యాల‌కు కారణమని భార‌త‌ మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ప్ర‌ధాన‌ ‌కోచ్‌‌ రవిశాస్త్రి, సార‌థి విరాట్ కోహ్లీకి కావల్సినంత ఫ్రీడమ్ ఇస్తాడని, అలాగే కోచ్ తన నుంచి ఏం కోరుకుంటున్నాడో కూడా విరాట్ కు తెలుస‌ని పేర్కొన్నాడు. ఇటీవ‌ల ఓ షోలో పాల్గొన్న నెహ్రా.. పలు ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పాడు.

‘రవిశాస్త్రి మంచి మోటివేటర్. అదే ఆయ‌న‌ బలం. ప్లేయ‌ర్స్ లో కాన్పిడెన్స్ నింపుతాడు. పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయినా భుజం త‌ట్టి న‌డిపిస్తాడు. కోహ్లీ కూడా జట్టును అదే త‌ర‌హాలో జ‌ట్టును ముందుకు న‌డిపిస్తాడు. ఇద్దరి ఆలోచనలు, మనస్థత్వాలు ఒకటే. అందుకే ఇద్ద‌రి మ‌ధ్య మంచి స‌మ‌న్వయం కుదిరింది. ఒక‌రి నిర్ణ‌యాల‌ను మ‌రొక‌రు గౌర‌వించుకుంటారు’‌ అని నెహ్రా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రవిశాస్త్రిని ఇండియా క్రికెట్ టీమ్ హెచ్ కోచ్‌గా 2017లో ఎంపిక చేశారు. ఇక కోహ్లీ-రవిశాస్త్రి కాంబినేషన్‌లోని భారత జట్టు అద్బుత విజాలు సాధించింది. 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ నెగ్గి హిస్ట‌రీ క్రియేట్ చేసింది.

Ashish Nehra Explains What Makes Virat Kohli-Ravi Shastri A Successful Captain-Coach Pair

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్