AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ వార్‌.. ఫార్మాట్‌ ఏదైనా.. ‘మెన్‌ ఇన్‌ బ్లూ’దే విక్టరీ!

అంతటి యుద్ధభూమిలోనే మట్టికరిపించాం. మరో విజయం కోసం ఎదురుచూస్తున్నాం. గెలిచినా.. ఆ పగ తీరేది కాదు, ఆగ్రహం చల్లారేదీ కాదు. అదో ఆత్మసంతృప్తి అంతే. ఎదురుపడిన ప్రతీసారి.. అది రణరంగమైనా, 11 మందితో ఆడే ఆట అయినా పాక్‌పై ప్రతి భారతీయుడు కోరుకునేది గెలుపు మాత్రమే. అందులోనూ ఫార్మాట్‌ ఏదైనా పైచేయి టీమిండియాదే అవుతోంది. గణాంకాలు కూడా 'మెన్‌ ఇన్‌ బ్లూ'దే విక్టరీ అంటోంది.

దుబాయ్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ వార్‌.. ఫార్మాట్‌ ఏదైనా.. 'మెన్‌ ఇన్‌ బ్లూ'దే విక్టరీ!
India Pak Asia Cup
Balaraju Goud
|

Updated on: Sep 13, 2025 | 9:45 PM

Share

ఆటను ఆటగానే చూడాలి. ఎస్.. అదే స్పోర్ట్స్‌ స్పిరిట్. బట్‌.. భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆ ఫార్ములా వర్క్‌అవుట్‌ అవదు. ఆటను ఆటగా చూడడం ఇంపాజిబుల్. ‘వెళ్లి మీ మోదీకి చెప్పు..’ అంటూ రక్తంతో తడిచిన చేతులు.. మన ఇంటి ఆడపడుచుల సౌభాగ్యాన్ని చెరిపేశాక కూడా ఈ ఆటను ఆటగా చూస్తారా..! మాంగల్యలను మాత్రమే టార్గెట్‌ చేస్తూ.. కళ్ల ముందే భర్త శరీరంలో తూటాలు దించుతుంటే.. ఆ చిందిన నెత్తురు నుదుటన సింధూరాన్ని చెరిపేస్తుంటే.. ఇల్లాలు ఏడ్చిన ఏడుపులు, నాటి ఆర్తనాదాలు ఇంకా పహల్గామ్‌ కొండల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆటను ఆటగా చూస్తారా..! సింధూర వర్ణపు ఉషోదయం కనిపిస్తున్న ప్రతీసారి అదే మారణహోమం కళ్లముందు కదలాడుతుంటే.. ఆటను ఆటలా చూస్తారా..! అందుకే.. పాక్‌తో అసలు మ్యాచ్‌లే వద్దంటూ.. ఓవైపు నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత్ పైనా, టీమిండియా పైనా, బీసీసీఐపైనా ఒత్తిడి తెస్తూ.. మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయమని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. బట్‌.. మ్యాచ్‌ జరగడం మాత్రం పక్కా. ఈసారి భావోద్వేగాలు కాదు కనిపించేది.. ప్రతి బాల్, ప్రతీ రన్‌కు రక్తం మరగడమే కనిపిస్తుంది. ఇంతకీ.. టీమిండియా బలం ఏంటి? భారత్‌ను ఢీకొట్టడానికి పాక్‌ దగ్గరున్న సరుకెంత? తెలుసుకుందాం..! అంతటి యుద్ధభూమిలోనే మట్టికరిపించాం. మరో విజయం కోసం ఎదురుచూస్తున్నాం. గెలిచినా.. ఆ పగ తీరేది కాదు, ఆగ్రహం చల్లారేదీ కాదు. అదో ఆత్మ సంతృప్తి అంతే. ఎదురుపడిన ప్రతీసారీ.. అది రణరంగమైనా,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి