మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం.. అసలు ఏమైందంటే?

అంతర్జాతీయ క్రికెట్‌లోనే ‘బిగ్ షో’ బిగ్ హిట్టర్‌గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. అర్ధాంతరంగా క్రికెట్‌ను కొద్దికాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. మానసిక ఆరోగ్య సమస్యలు కారణంగానే మాక్స్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైకేల్ లాయిడ్ వెల్లడించాడు. ‘కొద్దిరోజులుగా మాక్స్‌వెల్ మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అందువల్లే క్రికెట్ నుంచి కొద్దిగా విరామం తీసుకోవాలని అనుకున్నాడు. ఇక ఈ మానసిక సమస్యలను […]

మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం.. అసలు ఏమైందంటే?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2019 | 2:41 AM

అంతర్జాతీయ క్రికెట్‌లోనే ‘బిగ్ షో’ బిగ్ హిట్టర్‌గా పేరుగాంచిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. అర్ధాంతరంగా క్రికెట్‌ను కొద్దికాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. మానసిక ఆరోగ్య సమస్యలు కారణంగానే మాక్స్‌వెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని జట్టు సైకాలజిస్ట్ డాక్టర్ మైకేల్ లాయిడ్ వెల్లడించాడు.

‘కొద్దిరోజులుగా మాక్స్‌వెల్ మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అందువల్లే క్రికెట్ నుంచి కొద్దిగా విరామం తీసుకోవాలని అనుకున్నాడు. ఇక ఈ మానసిక సమస్యలను ముందుగానే గుర్తించిన గ్లెన్.. తగు చర్యలను తీసుకుంటున్నాడని’ లాయిడ్ స్పష్టం చేశారు.

అటు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘మాక్స్‌వెల్ అత్యంత ప్రతిభావంతుడు.. అంతేకాకుండా టీమ్‌లో ముఖ్యమైన సభ్యుడు. అతను ఆరోగ్యంగా తిరిగి వస్తాడని మేము కోరుకుంటున్నాం. యాజమాన్యం, జట్టు సభ్యులందరూ కూడా అతడికి తోడుగా ఉంటారని బోర్డులోని ఓ అధికారి వెల్లడించారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌‌లో గ్లెన్ మాక్స్‌వెల్ (62: 28 బంతుల్లో) అద్భుతంగా రాణించాడు. ఇలాంటి తరుణంలో అతడు ఈ ప్రకటన చేయడంతో నెటిజన్ల తొందరగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కాగా, మూడో టీ20కి మాక్స్‌వెల్ స్థానంలో డార్సీ షార్ట్‌ను జట్టులోకి తీసుకున్నారు.