AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఘోర ప్రమాదం.. కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో కెనడా స్టార్ ఇస్మాయిల్ కోనేకు తీవ్ర గాయం చేసిన ఖతార్ ఆటగాడు అసిమ్ మదిబోపై ఫిఫా 5 అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఈ ఘటన ప్రపంచ ఫుట్‌బాల్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో ఘోర ప్రమాదం.. కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
Fifa 2026
Rakesh
|

Updated on: Jun 25, 2026 | 8:13 AM

Share

FIFA World Cup 2026 : మెగా టోర్నమెంట్ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఒక ఊహించని విషాదకర ఘటన వెలుగుచూసింది. లైనప్‌లో భాగంగా కెనడా, ఖతార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ప్లేయర్ చేసిన రఫ్ గేమ్ కారణంగా మరో ప్లేయర్ తీవ్రంగా గాయపడ్డాడు. వాంకోవర్ నగరంలో జరిగిన ఈ హోరాహోరీ పోరులో కెనడా జట్టు 6-0 గోల్స్ తేడాతో ఖతార్‌ను చిత్తు చేసి, ప్రపంచకప్ చరిత్రలోనే తమ మొదటి అతిపెద్ద చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఈ భారీ గెలుపు సంబరాలను మైదానంలో జరిగిన ఒక ఘోరమైన ప్రమాదం పూర్తిగా కమ్మేసింది.

మ్యాచ్ సెకండ్ హాఫ్‌లో.. అంటే 51వ నిమిషంలో కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనే బంతితో వేగంగా దూసుకెళ్తుండగా, ఖతార్ డిఫెండర్ అసిమ్ మదిబో వెనుక నుంచి అత్యంత ప్రమాదకరమైన రీతిలో అతనిపైకి దూకాడు. ఈ టాకిల్ ఎంత బలంగా తగిలిందంటే, ఇస్మాయిల్ కోనే ఎడమ కాలు అక్కడికక్కడే విరిగిపోయింది. నొప్పితో విలవిలలాడుతూ కోనే గట్టిగా అరుస్తూ తన నోటిని చేతులతో మూసుకుని మైదానంలోనే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న ఆటగాళ్లకు ప్రమాదం తీవ్రత అర్థమవడంతో వెంటనే మెడికల్ టీమ్‌ను లోపలికి పిలిచారు.

మెడికల్ స్టాఫ్ వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించి, కోనేను స్ట్రెచర్‌పై బయటకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నేరుగా అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అతని ఎడమ కాలిలోని రెండు ప్రధాన ఎముకలైన టిబియా, ఫిబులా పూర్తిగా విరిగిపోయినట్లు నిర్ధారించి, అర్ధరాత్రి అత్యవసరంగా సర్జరీ నిర్వహించారు. ఇలాంటి తీవ్రమైన ఎముకల గాయాలు నయం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఇస్మాయిల్ కోనే రాబోయే కొన్ని నెలల పాటు ఫుట్‌బాల్ ఆటకు పూర్తిగా దూరం కానున్నాడు.

ఇస్మాయిల్ కోనే కాలు విరగడానికి కారణమైన అసిమ్ మదిబోకు అంపైర్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకు పంపించేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఫిఫా (FIFA) క్రమశిక్షణా కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అసిమ్ మదిబో ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా, సీరియస్ ఫౌల్ ప్లే కిందకు వస్తుందని స్పష్టం చేస్తూ, అతనిపై 5 అంతర్జాతీయ మ్యాచ్‌ల పాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై అప్పీల్ చేసుకునే హక్కు ఖతార్ టీమ్‌కు ఉన్నప్పటికీ, మేనేజ్‌మెంట్ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

మ్యాచ్ ముగిసిన తర్వాత తప్పు తెలుసుకున్న ఖతార్ ప్లేయర్ అసిమ్ మదిబో తీవ్ర విచారానికి గురయ్యాడు. నేరుగా ఇస్మాయిల్ కోనే చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అతనిని వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాడు. మరోవైపు సర్జరీ విజయవంతం అయిన తర్వాత ఇస్మాయిల్ కోనే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానుల కోసం ఒక ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. “నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారికి, నాకు మెసేజ్ చేసి ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమను నేను మాటల్లో చెప్పలేను” అని రాసుకొచ్చాడు.

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఈ 5 మ్యాచ్‌ల నిషేధం పెద్దదే అయినప్పటికీ, ఇంతకంటే కఠినమైన శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయి. 2014 బ్రెజిల్ వరల్డ్ కప్‌లో ఇటలీ డిఫెండర్ జార్జియోని నోటితో కొరికినందుకు గానూ ఉరుగ్వే స్టార్ ప్లేయర్ లూయిస్ సువారెజ్‌పై ఫిఫా ఏకంగా 9 మ్యాచ్‌ల అంతర్జాతీయ నిషేధంతో పాటు 4 నెలల పాటు ఎలాంటి ఫుట్‌బాల్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా బ్యాన్ విధించింది. అలాగే 1994 లో స్పెయిన్ ఆటగాడు లూయిస్ ఎన్రిక్ ముక్కు పగిలేలా మోచేత్తో పొడిచినందుకు ఇటలీ డిఫెండర్ మౌరో టాసోట్టిపై 8 మ్యాచ్‌ల నిషేధం విధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
విరాట్ కోహ్లీ వన్8 షూస్ సరికొత్త రికార్డు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు
2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. OTTలో తెగ చూస్తున్నారు