రాత్రికి రాత్రే స్టార్.. బర్రెలతోనే సాధ్యమైందంటున్న శ్రీనివాస్..!

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తేది ఎవరంటే.. జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసెన్ బోల్ట్ గుర్తొస్తారు. కేవలం 9.58 సెకన్లలోనే.. వంద మీటర్లు పరుగెత్తి.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సాధించినప్పటి నుంచి బోర్ట్‌ను జమైకా చిరుత అని పిలుస్తుంటారు. అయితే బోల్ట్‌ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ.. రాత్రికి రాత్రే.. హీరో అయ్యాడు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి […]

రాత్రికి రాత్రే స్టార్.. బర్రెలతోనే సాధ్యమైందంటున్న శ్రీనివాస్..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 6:20 AM

ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తేది ఎవరంటే.. జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసెన్ బోల్ట్ గుర్తొస్తారు. కేవలం 9.58 సెకన్లలోనే.. వంద మీటర్లు పరుగెత్తి.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు సాధించినప్పటి నుంచి బోర్ట్‌ను జమైకా చిరుత అని పిలుస్తుంటారు. అయితే బోల్ట్‌ రికార్డును కూడా బ్రేక్ చేస్తూ.. రాత్రికి రాత్రే.. హీరో అయ్యాడు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు చెందిన 28 ఏళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు మరల్చుకున్నాడు. అది కూడా నేలపైన కూడా కాదు.. ఏకంగా బురదలో అంత వేగంగా పరుగెత్తాడు. ఓ చెత్తో బర్రెలను పట్టుకుని మరి పరుగెత్తాడు.

మంగళూరు, ఉడుపి ప్రాంతాల్లో ప్రతిసారి “కంబళ” పేరుతో.. బర్రెలతో రన్నింగ్ రేస్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఓ గ్రామంలో నిర్వహించిన పోటీల్లో 28ఏళ్ల శ్రీనివాస గౌడ అనే వ్యక్తి తన ఎద్దులతో కలిసి కేవలం 13.62 సెకన్లలో.. 142.50మీటర్లు పరిగెత్తి ఘనవిజయం సాధించాడు. అయితే వేగం పరంగా లెక్కిస్తే.. శ్రీనివాస గౌడ 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తినట్లు గుర్తించారు. అంటే అతనికి తెలియకుండానే.. బోల్టక్ సాధించిన రికార్డుకంటే.. మరో 0.03 సెకన్ల తక్కువ సమయంలోనే పూర్తి చేశాడు. అయితే రికార్డుల పరంగా చూస్తే.. ఇది అఫీషియల్ కాకపోయినా.. శ్రీనివాస గౌడ వేగాన్ని చూసిన వాళ్లు మాత్రం ఫిదా అవుతున్నారు.కాగా.. శ్రీనివాస గౌడ రన్నింగ్ గురించి.. లోకల్ మీడియాలో రావడంతో పాటు.. పలు మీడియాల్లో కూడా రావడంతో.. ఈ విషయం కాస్త వైరల్‌గా మారింది. దీంతో శ్రీనివాస్ రాత్రికి రాత్రే స్టార్‌ అయ్యాడు.