Bungee jumping: వావ్‌.. 134 మీ.నుంచి విజయ్‌ శంకర్‌ బంగీజంప్‌!

Bungee jumping: టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గుర్తున్నాడా..? గతేడాది అంబటి రాయుడి ప్లేస్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యాడుగా ఆ ఆటగాడు.. అతడి ఎంపికపై విమర్శలు రాగా మూడు కోణాల్లో ఉపయోగపడతాడని అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో అంచనాలను అందుకోలేక నాలుగో స్థానంలో విజయ్‌ విఫలమయ్యాడు. నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ గాయపడి స్వదేశానికి వచ్చేశాడు. ఆ తర్వాత అతడిని జాతీయ జట్టులో మళ్లీ చూడలేదు. ప్రపంచకప్‌లో […]

Bungee jumping: వావ్‌.. 134 మీ.నుంచి విజయ్‌ శంకర్‌ బంగీజంప్‌!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 5:23 PM

Bungee jumping: టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గుర్తున్నాడా..? గతేడాది అంబటి రాయుడి ప్లేస్‌లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యాడుగా ఆ ఆటగాడు.. అతడి ఎంపికపై విమర్శలు రాగా మూడు కోణాల్లో ఉపయోగపడతాడని అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీలో అంచనాలను అందుకోలేక నాలుగో స్థానంలో విజయ్‌ విఫలమయ్యాడు. నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ గాయపడి స్వదేశానికి వచ్చేశాడు. ఆ తర్వాత అతడిని జాతీయ జట్టులో మళ్లీ చూడలేదు.

ప్రపంచకప్‌లో అంచనాలు అందుకోలేక విఫలమైన ఈ రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌.. ప్రస్తుతం దేశవాళీల్లో తమిళనాడు, భారత్‌-ఏ తరఫున క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడు భారత్‌-ఏ తరఫున షాడో టూర్‌ కోసం న్యూజిలాండ్‌ వెళ్లాడు. న్యూజిలాండ్‌లో అత్యంత ఎత్తైన, ప్రమాకరమైన బంగీ జంప్‌ (నెవిస్‌ బంగీ) చేసి ఔరా! అనిపించాడు. క్వీన్స్‌టౌన్‌లోని దక్షిణ ఆల్ప్స్‌ పర్వాతాల మధ్య ఈ వేదిక ఉంటుంది. రెండు కొండల మధ్య నెవిస్‌ నది ప్రవహిస్తుంటుంది. అటు.. ఇటు రోప్‌వే మాదిరిగా ఒక వేదిక కదులుతుంది. అది పర్వతాల మధ్యలోకి వచ్చాక అక్కడి నుంచి దూకేస్తారు.

న్యూజిలాండ్‌లోని నెవిస్‌ బంగీ జంప్‌ ఎత్తు 134 మీటర్లు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన వాటిలో మూడోది. దూకే వ్యక్తి గంటకు 128 కి.మీ వేగంతో కిందకు పడతాడు. తొలి 8 సెకన్లు ఫ్రీఫాల్‌ ఉంటుంది. దూకుతున్నప్పుడు భయం, సరదా, ఆందోళన ఉంటాయి. ఇలాంటి జంప్‌ చేయడం ఆషామాషీ ఏం కాదు. ఎంతో ధైర్యం అవసరం. అది విజయ్‌ శంకర్‌ చేయడం గొప్పే. ‘వావ్‌.. నా ఒంట్లో అడ్రినలిన్‌ పొంగిపొర్లింది. న్యూజిలాండ్‌లో అత్యంత ఎత్తైన బంగీజంప్‌ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. కుదిరితే అందరూ ఇది చేయాలని కోరుతున్నా’ అని విజయ్‌ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు.

[svt-event date=”15/02/2020,5:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]