AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB Tweets: ఇంతకీ కోహ్లీ కెప్టెన్సీ ఉందా..? ఊడిందా..?

గత రెండు రోజుల నుంచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్లలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో జట్టు పేరు మారబోతోందని ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. పేరు మార్చారు.. ఫోటోలు తీశారు.. ఇంతకీ కోహ్లీ కెప్టెన్సీ అయినా ఉందా.. లేక ఊస్టా.. అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

RCB Tweets: ఇంతకీ కోహ్లీ కెప్టెన్సీ ఉందా..? ఊడిందా..?
Ravi Kiran
|

Updated on: Feb 14, 2020 | 3:27 PM

Share

RCB Tweets: గత రెండు రోజుల నుంచి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీకి  సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో జట్టు పేరు మారబోతోందని ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. పాత పోస్టులు డిలీట్ కావడం, జట్టు పేరు మారడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫోటోలు సైతం లేకపోవడంతో పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చకు దిగారు.(Virat Kohli)

సాధారణంగా జట్టు పేరు మార్చడం లాంటి విషయాలన్నింటినీ ఒకసారి కెప్టెన్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు. అయితే ఇక్కడ అంతా సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫోటోల తొలగింపు విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్స్ కూడా చేశాడు.

ఐపీఎల్ చరిత్రలోనే ఇంతవరకు ట్రోఫీ గెలవని జట్టు ఏదీ అంటే తడుముకోకుండా రాయల్ ఛాలెంజర్స్ అని చెప్పొచ్చు. అందుకు చాలానే కారణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం యాజమాన్యం ఆ కారణం చేత ఇలా ప్రవర్తిస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. పేరు మార్చారు.. ఫోటోలు తీశారు.. ఇంతకీ కోహ్లీ కెప్టెన్సీ అయినా ఉందా.. లేక ఊస్టా.. అని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Few Changes Ahead Of New Zealand Test Series

ఒకవేళ నిజంగానే అతడ్ని కెప్టెన్సీ పదవి నుంచి తీసేస్తే మాత్రం.. కోహ్లీకి అంతకు మించిన పరువు తక్కువ మరొకటి ఉండదు. కాబట్టి ఫ్రాంచైజీ అలా చేయదు. కానీ గతంలో మాదిరిగా ఆయనకు గౌరవం ఇవ్వడం, ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించాయని కామెంట్స్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఆర్సీబీ తన కొత్త లోగోను అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు పెట్టిన సంగతి తెలిసిందే.