కివీస్‌తో వన్డే సిరీస్ ఓటమి.. ఆ నలుగురిపై వేటు తప్పదా.?

India Vs New Zealand: కివీస్‌తో పొట్టి సిరీస్ గెలిచిందని అనుకునేలోపే.. టీమిండియా వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టును సునాయాసంగా గెలిపించింది. మూడో వన్డే తర్వాత కెప్టెన్ కోహ్లీ కూడా టీమ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జట్టులో ఏకాగ్రత లోపించిందని.. తాము ప్రదర్శించిన ఆటతీరుతో ఎప్పటికీ కూడా విజయానికి అర్హులు కాలేమని ఆవేదన చెందాడు. ఇదిలా ఉండగా భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడానికి […]

కివీస్‌తో వన్డే సిరీస్ ఓటమి.. ఆ నలుగురిపై వేటు తప్పదా.?
Follow us

|

Updated on: Feb 12, 2020 | 2:10 PM

India Vs New Zealand: కివీస్‌తో పొట్టి సిరీస్ గెలిచిందని అనుకునేలోపే.. టీమిండియా వన్డే సిరీస్‌లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. పసలేని బౌలింగ్, పేలవమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టును సునాయాసంగా గెలిపించింది. మూడో వన్డే తర్వాత కెప్టెన్ కోహ్లీ కూడా టీమ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జట్టులో ఏకాగ్రత లోపించిందని.. తాము ప్రదర్శించిన ఆటతీరుతో ఎప్పటికీ కూడా విజయానికి అర్హులు కాలేమని ఆవేదన చెందాడు.

ఇదిలా ఉండగా భారత్ వన్డే సిరీస్ ఓడిపోవడానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని చెప్పాలి. సిరీస్ ఏదైనా.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించేవాడు.. అలాంటిది ఈ మూడు వన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అటు యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన లయను కోల్పోయాడు. టీ20 సిరీస్‌లో తన బౌలింగ్‌లో తక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ.. వన్డేల్లో మాత్రం వికెట్‌లేమి తీయకుండా బ్యాట్స్‌మెన్‌కు పరుగులు సమర్పించాడు. ఇక చివరిగా రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు లేకపోవడం భారత్‌కు గట్టి దెబ్బ తగిలింది. అందుకే టీమిండియా యాజమాన్యం టెస్టు సిరీస్‌కు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చిన్న తప్పిదాలు కూడా చోటు చేసుకోకుండా ఉండేందుకు బలమైన లైనప్‌ను ఎంచుకోవాలని అనుకుంటున్నారు. టెస్టు జట్టులో సుమారు నలుగురిపై వేటు పడేలా కనిపిస్తోంది. కాగా, టెస్టు సిరీస్‌కు కూడా రిషబ్ పంత్‌కు చోటు దక్కే అవకాశం కనిపించట్లేదు.

టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, సాహా, రిషబ్ పంత్, అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, షమీ, సైనీ, ఇషాంత్ శర్మ( నో క్లారిటీ)