
క్రికెట్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పుడు తన పుత్రరత్నం అర్జున్ టెండుల్కర్ కెరీర్‌పై దృష్టిపెట్టారు. ఆటపై శ్రద్ధ పెట్టమని అర్జున్‌కు చెప్పకనే చెప్పారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ‘సింటిలేటింగ్ సచిన్’ పుస్తకావిష్కరణ సందర్భంగా కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి హితబోధ చేశారు. నా తల్లిదండ్రులు నాకెలాంటి స్వేచ్ఛనిచ్చారో.. అదే స్వేచ్ఛని అర్జున్ టెండూల్కర్‌కి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు సచిన్. క్రీడాకారుడికి మొదట తనపై తనకు నమ్మకముండాలని, అప్పుడే ఎదుటి వారికి మీపై నమ్మకమేర్పడుతుందని అర్జున్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆటపై దృష్టి పెట్టమని తన తండ్రి తనకు చెప్పేవారనీ.. ఇప్పుడు తాను కూడా అర్జున్‌కు అదే చెబుతున్నానని చెప్పారు సచిన్ టెండూల్కర్.
పిల్లలు తమకిష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని తల్లిదండ్రులకు సూచించారు సచిన్. వారు కోరుకున్న రంగాల్లో రాణించడానికి కుటుంబం మద్దతు కీలకమని వ్యాఖ్యానించారు. తన కుటుంబసభ్యుల నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందన్నారు సచిన్. ఏదైనా సమస్య వస్తే తన తమ్ముడు అజిత్ టెండూల్కర్ చూసుకునేవారన్నారు. మరో తమ్ముడు నితిన్ టెండూల్కర్ తన పుట్టినరోజున తన కోసం పెయింటింగ్ వేయించాడని బుక్‌రిలీజ్ సందర్భంగా మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు సచిన్ టెండూల్కర్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..