Manu Bhaker: షూటర్ మను బాకర్ చిలిపి పనులు..క్లాస్‌కి డుమ్మా కొట్టి..
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ మను బాకర్ భారత్‌కు డబుల్ పతకాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన లైఫ్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆమె తను మొదట పిస్టల్ పట్టుకున్నట్లు తెలిపింది.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్ మను బాకర్ భారత్‌కు డబుల్ పతకాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తన లైఫ్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆమె తను మొదట పిస్టల్ పట్టుకున్నట్లు తెలిపింది. తన స్కూల్ అకాడమీలో 14 సంవత్సరాలు వయస్సు ఉన్నప్పుడు హిస్టరీ క్లాస్‌ని బంక్ కొట్టినట్లు చెప్పుకొచ్చింది. ఆమె తన ఎయిర్ రైఫిల్‌తో షాట్ కాల్చడానికి ముందు తన ఊపిరిని ఎక్కువసేపు పట్టుకున్న విషయాన్ని కూడా తెలిపింది.
“షాట్ తీస్తున్నప్పుడు, మీ శ్వాసను 15, 20 సెకన్ల పాటు పట్టుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది నేను దాదాపు 35 సెకన్ల పాటు చేశాను. నేను ‘చలే దే, చలా దే’ (అగ్ని, నిప్పు) లాగా ఉన్నాను”అంటూ ఆమె నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది. మీ సోషల్ మీడియా ఎకౌంట్స్‌లో ఏం పోస్ట్ చేస్తారు అని యాంకర్ అడుగగా..“ఒక వ్యక్తి గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే ఒక విషయం లేదా మరొకటి ఎల్లప్పుడూ ఉంటుంది. నేను నా ప్రయాణం, నా శిక్షణ క్షణాలు, మ్యాచ్‌లు, పోటీలు మరియు నా దినచర్యలు మరియు ఇతర విషయాల గురించి మాట్లాడుతాను”అని ఆమె చెప్పింది.
ఆమె ఇంటర్వ్యూ వీడియో:
View this post on Instagram
ప్రస్తుతం ఆ వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. మను బాకర్ కూడా మనలాగే ఉంది కాదా క్లాస్‌లను డుమ్మా కొడుతుందని కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం సాధించిన భాకర్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచింది.