AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chahal Spotted With Mystery Girl: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ‘మిస్టరీ గర్ల్’తో చాహల్.. ఎవరో తెలుసా?

Yuzvendra Chahal - Dhanashree: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకు వచ్చాడు. మ్యాచ్ సమయంలో అతను ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Chahal Spotted With Mystery Girl: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు 'మిస్టరీ గర్ల్'తో చాహల్.. ఎవరో తెలుసా?
Chahal Spotted With Mystery
Venkata Chari
|

Updated on: Mar 09, 2025 | 6:55 PM

Share

Yuzvendra Chahal Spotted With Mystery Girl: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జట్టుకు మంచి ఆరంభం లభించింది. కానీ, తర్వాత భారత బౌలర్లు రాణించడంతో టీమిండియా ఆధిపత్యం చూపిస్తోంది. అయితే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ఒక ‘మిస్టరీ గర్ల్’తో కనిపించాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వేగంగా వైరలవుతోంది. ఆమె ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

‘మిస్టరీ గర్ల్’ తో చాహల్..

భారత జట్టుకు మద్దతు ఇవ్వడానికి చాహల్ కూడా దుబాయ్ చేరుకున్నాడు. చాహల్ ప్రస్తుతం టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా, చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. నిజానికి చాహల్ ఫిబ్రవరి 2025లో ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకున్నాడు. వీరిద్దరూ 2020 సంవత్సరంలో గుర్గావ్‌లో వివాహం చేసుకున్నారు. కానీ, వీరి సంబంధం కొన్ని సంవత్సరాలలోనే ముగిసింది. విడాకుల తర్వాత, దుబాయ్‌లో జరుగుతోన్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా చాహల్ ఒక ‘మిస్టరీ గర్ల్’తో కనిపించాడు. ఆమె ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే, ఆ అమ్మాయి ఆర్జే మహవాష్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

అసలెవరీ ఆర్జే మహవాష్?

ఆర్‌జే మహ్వాష్ ఢిల్లీకి చెందిన రేడియో జాకీ. రేడియో, సోషల్ మీడియా ప్రపంచంలో తనను తాను కంటెంట్ సృష్టికర్తగా పరిచయం చేసుకుంది. తన అసాధారణ ప్రతిభను ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందింది. ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్ నుంచి పట్టభద్రురాలైన మహ్వాష్ రేడియో జాకీగా తన కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రాంక్‌స్టర్‌గా మారింది. ఆమె వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.4 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు.

ధనశ్రీ వర్మకు మద్దుతుగా నెటిజన్స్..

విడాకుల తర్వాత చాహల్, ధన శ్రీవర్మ విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫొటో వైరల్ అవుతోన్న తరుణంలో నెటిజన్స్ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచారు. విడాకుల తర్వాత ధనశ్రీ వర్మ ఇలా వేరే వ్యక్తితో కనిపిస్తే ఎలా ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..