నా మనసు కివీస్ పోరాటానికి దాసోహం అయ్యింది- యూవీ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ పరిణామాల మధ్య సాగిందో అందరికి తెలిసిన విషయమే. స్కోర్లు టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై కావడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించారు. కాగా ఐసీసీ నిబంధనలపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బౌండరీల కౌంట్ ఆధారంగా విజేతను ఎంపిక చేయడంపై ఇండియన్ మాజీ క్రికెటర్ యువీ తన అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను ఆ రూల్‌ను అంగీకరించడం లేదు. కానీ […]

నా మనసు కివీస్ పోరాటానికి దాసోహం అయ్యింది- యూవీ
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 16, 2019 | 11:02 AM

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠ పరిణామాల మధ్య సాగిందో అందరికి తెలిసిన విషయమే. స్కోర్లు టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై కావడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించారు. కాగా ఐసీసీ నిబంధనలపై పలువురు మాజీ క్రికెటర్లు, క్రికెట్ లవర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బౌండరీల కౌంట్ ఆధారంగా విజేతను ఎంపిక చేయడంపై ఇండియన్ మాజీ క్రికెటర్ యువీ తన అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను ఆ రూల్‌ను అంగీకరించడం లేదు. కానీ నిబంధనలు అందరికి వర్తించేవే. వరల్డ్ కప్ అందుకున్న ఇంగ్లాండ్‌కు శుభాకాంక్షలు. అద్భుతమైన పోరాటం  చేసిన కివీస్ వైపే నా హృదయం ఉంటుంది. అద్బుత మ్యాచ్..గొప్ప ఫైనల్’ యువీ పేర్కొన్నాడు.