
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ముందు ముంబై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గాయం కారణంగా సోమవారం నుంచి జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఒక వేళ ముంబై ఫైనల్‌కు చేరితే.. అప్పటి వరకు కూడా జైస్వాల్ కోలుకుంటాడా? లేదా అన్నది కూడా డౌట్‌గా మిగిలింది. దేశవాలి క్రికెట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నెల 17 నుంచి నాగ్‌పూర్‌లోని విదర్భా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముంబై – విదర్భ జట్ల మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కీలక మ్యాచ్‌కి ముందు ముంబై ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు కాలి మడిమ గాయంతో సెమీస్ దూరం అయ్యాడు. ఇటీవలె ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో జైస్వాల్ తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీకి రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న జైస్వాల్‌కు తొలి వన్డే ఆడే అవకాశం వచ్చింది. కానీ, పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ టీమ్‌లోకి రావడంతో జైస్వాల్‌ను పక్కనపెట్టి, గిల్‌ను ఓపెనర్‌గా ఆడించారు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జైస్వాల్.. డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై జట్టుతో జత కలిశాడు. కానీ, దురదృష్టవశాత్తు యాంకెల్ ఇంజ్యూరీతో సెమీస్‌కు దూరం అయ్యాడు. జైస్వాల్ గాయంపై ఆరా తీసిన బీసీసీఐ వెంటనే అతన్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పంపి, చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఎందుకంటే జైస్వాల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి జైస్వాల్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వౌడ్‌లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, ఎక్స్‌ట్రా స్పిన్నర్ కోసం జైస్వాల్‌ను కాదని వరుణ్ చక్రవర్తిని స్క్వౌడ్‌లోకి తీసుకున్నారు భారత సెలెక్టర్లు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోయినా.. ఇండియన్ టీ20, టెస్టుల టీమ్స్‌లో జైస్వాల్ ఎంతో కీలకమైన ఆటగాడు. అందుకే బీసీసీఐ అతని విషయంలో ఇమిడియేట్‌గా రియాక్ట్ అయింది.
Yashasvi Jaiswal will miss the Ranji Trophy Semi-Final due to Left Ankle Pain. [Gaurav Gupta from TOI] pic.twitter.com/6QW3w0mRxH
— Johns. (@CricCrazyJohns) February 16, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.