Video: తొలి ఓవర్‌లో 5 ఫోర్లు.. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఢిల్లీని వణికించిన 21 ఏళ్ల ఓపెనర్.. టీమిండియాలో ఛాన్స్ దొరికేనా?
Rajasthan Royals vs Delhi Capitals: ఐపీఎల్ 2023లో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇంత తక్కువ సమయంలోనే భారత యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా బౌలర్లను చిత్తు చేస్తూ.. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఈ యువకులలో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు కూడా చేరింది.
Yashasvi Jaiswal: ఐపీఎల్ 2023లో కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఇంత తక్కువ సమయంలోనే భారత యువ ఆటగాళ్లు తమ సత్తా చాటారు. ముఖ్యంగా బౌలర్లను చిత్తు చేస్తూ.. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఈ యువకులలో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరు కూడా చేరింది. అతను సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరింత దూకుడు ప్రదర్శించిన యశస్వి మ్యాచ్ తొలి ఓవర్‌లోనే ఫోర్‌ల మోత మోగించాడు.
గౌహతిలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సీజన్‌లోని మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో జైస్వాల్ తొలి బంతికే సిక్సర్ బాదిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీపై కూడా అలానే ప్రారంభించి ఆ తర్వాత విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో యశస్వి కేవలం 25 బంతుల్లోనే రెండో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ లీగ్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లో 5 ఫోర్లు కొట్టి అద్భుతమైన ఆరంభం అందించాడు.
తొలి ఓవర్‌లో 5 ఫోర్లు, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ..
1-2 ka 4, 4-2 ka bhi 4 – Yashaswi Jaiswal is dealing in boundaries only! #IPLonJioCinema #IPL2023 #TATAIPL | @rajasthanroyals pic.twitter.com/9EE0BmtnxB
— JioCinema (@JioCinema) April 8, 2023
ఓపెనింగ్‌కి దిగిన యశస్వి, ఢిల్లీ క్యాపిటల్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ తొలి బంతినే ఫోర్‌కి పంపాడు. ఆ తర్వాత రెండు బంతుల్లోనూ ఫోర్లు బాది, హ్యాట్రిక్ కొట్టేశాడు. నాలుగో బంతికి ఫోర్ మిస్ అయ్యాడు. ఓవరాల్‌గా తొలి ఓవర్‌లోనే 5 ఫోర్లు బాది బౌలర్‌కు షాకిచ్చాడు.
ఆ తర్వాత, అతను ఐదో ఓవర్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్‌పై వరుసగా మూడు ఫోర్లు బాదేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ ఎనిమిదో ఓవర్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 పరుగులు (30 బంతులు, 11 ఫోర్లు, 1 సిక్స్) చేసిన తర్వాత అతను ఔటయ్యాడు.
జైస్వాల్ మాత్రమే కాదు, జోస్ బట్లర్ కూడా విధ్వంసక మూడ్‌లో కనిపించాడు. తొలి ఓవర్‌లో జైస్వాల్ ఐదు ఫోర్లు బాదగా, తర్వాతి ఓవర్‌లోనే జోస్ బట్లర్ కూడా ఎన్రిక్ నోర్కియా బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఈ విధంగా మొదటి రెండు ఓవర్లలో రాజస్థాన్ తొమ్మిది ఫోర్లు కొట్టి తుఫాను ఆరంభం అందించారు. బట్లర్, యశస్విల ఈ తుఫాన్ ఆరంభం ఆధారంగా, రాజస్థాన్ పవర్‌ప్లేలోనే 68 పరుగులు చేసింది.
ప్లేయింగ్ 11 నుంచి పృథ్వీ షా ఔట్..
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌కు జోస్ బట్లర్ రూపంలో పెద్ద ఊరట లభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ గత మ్యాచ్‌లో వేలి గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేడంటూ వార్తలు వచ్చాయి. కానీ అతను సమయానికి ఫిట్‌గా ఉన్నాడు. అదే సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాను తొలగించి, అతని స్థానంలో మనీష్ పాండేని తీసుకుంది. షాను సబ్‌స్టిట్యూట్‌లో చేర్చినప్పటికీ, అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..