Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. భారత్‌తో తలపడేది ఎవరంటే?

WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం కసరత్తులు ఇప్పటికే మొదలయ్యాయి. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే పనిలో అన్ని జట్లూ బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలను ఆక్రమించాయి. అయితే, పాయింట్ల పట్టికలో వేరే నంబర్ల గేమ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ముందు ఓ జట్టు అడ్డుగా నిలుస్తోంది.

WTC Final: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి ఔట్.. భారత్‌తో తలపడేది ఎవరంటే?
Wtc Final 2025 Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Sep 12, 2024 | 7:30 PM

Share

WTC Points Table: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం కసరత్తులు ఇప్పటికే మొదలయ్యాయి. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే పనిలో అన్ని జట్లూ బిజీగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాలు పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలను ఆక్రమించాయి. WTC ఫైనల్‌ ఈరెండు జట్ల మధ్య మరోసారి టైటిల్ పోరు కనిపించవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, పాయింట్ల పట్టికలో వేరే నంబర్ల గేమ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ముందు ఓ జట్టు అడ్డుగా నిలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కూడా WTC ఫైనల్ సమీకరణాన్ని పంచుకుంది.

బంగ్లాదేశ్‌తో భారత్ సిరీస్..

పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో భారత జట్టు స్వదేశంలో 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో స్థానం మరింత పటిష్టం చేసుకోవచ్చు. WTC ఫైనల్ చేరే రేసులో భారత్‌కే అత్యధిక అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తర్వాత భారత్ కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా టూర్‌లో 5 టెస్టుల్లో కనీసం 3 టెస్టుల్లో భారత్ గెలిస్తే ఫైనల్స్‌లో చోటు ఖాయం చేసుకోవచ్చు. టీమ్ ఇండియా మొత్తం 10 టెస్టుల్లో గెలిస్తే ఆ జట్టు పాయింట్ల శాతం 85.09 అవుతుంది. ఆస్ట్రేలియా టూర్‌తో పాటు సొంతగడ్డపై జరిగే 5 టెస్టుల్లోనూ భారత్ గెలిస్తే పాయింట్ల శాతం 79.76కి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం టీమ్ ఇండియాకు ఫైనల్ చేరే మార్గం సులభమైంది.

ఆస్ట్రేలియాకు కూడా సవాల్‌..

గత 10 ఏళ్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా చేజిక్కించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా ఈ జట్టుకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై 5 టెస్టులు, శ్రీలంకతో స్వదేశంలో 2 టెస్టులు గెలిస్తే, అది గరిష్టంగా 76.32 శాతం పాయింట్లను స్కోర్ చేస్తుంది. ఇది ఫైనల్‌కు మంచిది. అయితే, ఆస్ట్రేలియా ముందు న్యూజిలాండ్ జట్టు అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలు..

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని భారత్ నుంచి న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియా కంటే ఈ జట్టుకే ఫైనల్స్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కివీస్ జట్టు భారత్‌తో 3, శ్రీలంకతో 2 టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో 3 టెస్టుల సిరీస్ కూడా జరగనుంది. ఈ జట్టుకు ఇంకా 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 50 శాతం పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే, అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఈ జట్టు 78.57 పాయింట్లు పొందే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..