WTC Final 2023: ఓవల్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌పై కంగారుల ఆధిక్యం కొనసాగుతోంది. ఇరు జట్లకు తొలి బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసే సరికి ఆస్ట్రేలియా కంటే భారత్ 173 పరుగులు వెనుకబడి ఉంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున అజింక్యా రహానే(89), రవీంద్ర జడేజా(48), శార్దుల్ ఠాకూర్(51) మినహా రోహిత్, కోహ్లీ సహా అంతా చేతులెత్తేశారు. ముఖ్యంగా 18 నెలల తర్వాత భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన రహానే తన కీలక ఇన్నింగ్స్‌తో ఓ ఆరుదైన రికార్డ్ సృష్టించాడు. మొత్తం 89 పరుగులు చేసిన రహానే 69 పరుగుల వద్ద టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా తరఫున 5000 వేల పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 13 బ్యాటర్‌గా అవతరించాడు. రహానే(5020*) కంటే ముందు కపిల్ దేవ్ (5248), గుండప్ప విశ్వనాథ్ (6080), మహ్మద్ అజారుద్దీన్ (6215), దిలీప్ వెంగ్‌సర్కార్ (6868), చెతేశ్వర్ పుజారా (7168*), సౌరవ్ గంగూలీ (7212), విరాట్ కోహ్లీ (8430*), సెహ్వాగ్ (8503), VVS లక్ష్మణ్ (8781), సునీల్ గవాస్కర్ (10122), రాహుల్ ద్రవిడ్ (13265), సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.
అయితే రహానే సాధించిన ఈ ఘనత కంటే కూడా డబ్య్లూటీసీ ఫైనల్‌లో అతని ఇన్నింగ్స్ టీమిండియాకి ఎంతో కీలకమని చెప్పుకోవాలి. 129 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ సహా మొత్తం 81 పరుగులు చేసిన రహానే టీమ్ స్కోర్‌ని పెంచడంలో కీలకంగా మారాడు. అలాగే తను చేసిన ఆర్థసెంచరీతో టీమిండియా తరఫున డబ్ల్యూటీసీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. దీంతో రహానే తనకు అంది వచ్చిన ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయింది. ఇంకా అతనితో పాటు క్రీజులో నిలబడిన శార్ధుల్ ఠాకూర్ కూడా అర్ధ సెంచరీతో మెరిసాడు. వీరిద్దరు కలిసి కీలక సమయంలో భారత జట్టుకు 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
5000 Test runs and going strong ??
Keep going, @ajinkyarahane88 #TeamIndia pic.twitter.com/VixAtmYrRK
— BCCI (@BCCI) June 9, 2023
కాగా, భారత్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై ఆసీస్ 173 పరుగుల ఆధీక్యంతో నిలిచింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఆస్ట్రేలియా 21 ఓవర్ల ఆట ముగిసేసరికి వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా(13) వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది. అంటే ప్రస్తుతానికి మొత్తంగా టీమిండియాపై 228 పరుగుల ఆధిక్యంతో ఆస్ట్రేలియా కొనసాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..