AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అదృష్టం కలిసొస్తే ఇలాగే ఉంటది.. లార్డ్ శార్దుల్‌, రహానేలకు ఎన్నో లైఫ్ లైన్స్.. నెట్టింట్లో పేలుతోన్న జోకులు..

Shardul Thakur: స్లిప్‌లో శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన 2 క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్‌ను పాట్ కమిన్స్ అవుట్ చేసినా అది నో బాల్‌గా మారింది.

Video: అదృష్టం కలిసొస్తే ఇలాగే ఉంటది.. లార్డ్ శార్దుల్‌, రహానేలకు ఎన్నో లైఫ్ లైన్స్.. నెట్టింట్లో పేలుతోన్న జోకులు..
Pat Cummins No Ball
Venkata Chari
|

Updated on: Jun 09, 2023 | 9:22 PM

Share

WTC Final 2023, Aus vs Ind: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 469 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా చేసిన 469 పరుగులకు సమాధానంగా టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. అయితే, భారత బ్యాట్స్‌మెన్‌కు అదృష్టం ఎంతగానో తోడ్పడినప్పటికీ, టీమిండియా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.

క్యాచ్‌లు మిస్.. నోబాల్‌లో ఔట్..

స్లిప్‌లో శార్దూల్ ఠాకూర్ ఇచ్చిన 2 క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్‌ను పాట్ కమిన్స్ ఔట్ చేసినా అది నో బాల్‌గా మారింది. దీంతో శార్దూల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ లాగే… ముందుగా రెండో రోజు అజింక్యా రహానెను పాట్ కమిన్స్ ఔట్ చేశాడు. కానీ, రహానే రివ్యూ తీసుకునే సరికి ఆ బంతి నో బాల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్.. అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ ఇద్దరినీ అవుట్ చేశాడు. కానీ, అదృష్టం మద్దతు ఇవ్వలేదు. రెండు సార్లు బంతి నో బాల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ICC (@icc)

అజింక్యా రహానే – శార్దూల్ ఠాకూర్ మధ్య కీలక భాగస్వామ్యం..

అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మధ్య ఏడో వికెట్‌కు 109 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొంది. అజింక్య రహానే 129 బంతుల్లో 89 పరుగులు చేసి పాట్ కమిన్స్‌కు బలయ్యాడు. అదే సమయంలో శార్దూల్ ఠాకూర్ కూడా యాభై పరుగుల ఫిగర్ దాటాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 296 పరుగులకు ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా తరపున కెప్టెన్ పాట్ కమిన్స్ అత్యధికంగా 3 వికెట్లు, మిచెల్ స్టార్క్, స్కాట్ బౌలాండ్, కామెరాన్ గ్రీన్ తలో 2 వికెట్లు సాధించారు. నాథన్ లియాన్ 2 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..