WPL 2024: అయ్యో అయ్యయ్యో! ఆర్‌సీబీ బ్యాటర్ పవర్ ఫుల్ సిక్సర్.. దెబ్బకు కారు అద్దాలు ధ్వంసం.. వీడియో

|

Mar 05, 2024 | 8:19 AM

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 50 బంతుల్లో 80 పరుగులతో విజృంభించగా, కెప్టెన్‌కు మంచి సహకారం అందించిన ఎల్లీస్ పెర్రీ కూడా 37 బంతుల్లో 58 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అఅయితే పెర్రీ కొట్టిన ఒక భారీ సిక్సర్ బౌండరీకి ​​సమీపంలో పార్క్ చేసిన టాటా పంచ్ కారు అద్దాన్ని పగులగొట్టింది.

WPL 2024: అయ్యో అయ్యయ్యో! ఆర్‌సీబీ బ్యాటర్ పవర్ ఫుల్ సిక్సర్.. దెబ్బకు కారు అద్దాలు ధ్వంసం.. వీడియో
Ellyse Perry
Follow us on

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. యూపీ వారియర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 50 బంతుల్లో 80 పరుగులతో విజృంభించగా, కెప్టెన్‌కు మంచి సహకారం అందించిన ఎల్లీస్ పెర్రీ కూడా 37 బంతుల్లో 58 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అఅయితే పెర్రీ కొట్టిన ఒక భారీ సిక్సర్ బౌండరీకి ​​సమీపంలో పార్క్ చేసిన టాటా పంచ్ కారు అద్దాన్ని పగులగొట్టింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 19వ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది. ఇ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ లో 19వ ఓవర్ బంతిని తీసుకుంది దీప్తి శర్మ. ఆ ఓవర్ మూడో బంతికి భారీ బౌండరీ బాదగా, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పెర్రీ అదే ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్ బాదింది. బంతి నేరుగా మైదానంలోని బౌండరీ లైన్‌లో పార్క్ చేసిన కారు డోర్ గ్లాస్‌ను పగులగొట్టింది.

దీనిని చూసి ఫెర్రీతో సహా గ్రౌండ్‌లోని క్రికెటర్లు, మైదానంలోని ఆడియెన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఓవర్‌కు ముందు 18వ ఓవర్‌లో కూడా 3 భారీ సిక్సర్లు వచ్చాయి. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఈ ఓవర్‌లోని తొలి రెండు బంతులను పెర్రీ బాదగా, రిచా ఘోష్ ఆ ఓవర్ ఐదో బంతిని సిక్సర్‌గా బాదింది. ఈ ఓవర్‌ లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ పై ఘన విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

ఫెర్రీ పవర్ ఫుల్ సిక్సర్.. వీడియో ఇదిగో..

బెంగళూరు బ్యాటర్ల సిక్సర్ల వర్షం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..