IND vs PAK: భారత్ వర్సెస్ పాక్ పోరులో విజేత ఎవరు.. 14వ తేదీ ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసా?
India Vs Pakistan Head to Head Records: ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 15 న జరగాల్సి ఉంది. అయితే షెడ్యూల్ మార్పుల కారణంగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ తేదీని ఒకరోజు ముందుకు మార్చారు. దీంతో ఇరుదేశాల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది. 4 మ్యాచ్‌లు ఫలితం ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన 132 వన్డేల్లో 14వ తేదీన 4 మ్యాచ్‌లు జరిగాయి.

World Cup 2023, Ind Vs Pak: ప్రపంచ కప్ 2023లో భారత్ (India) వర్సెస్ పాకిస్థాన్ (Pakistan) జట్లు ఇప్పుడు అక్టోబర్ 14న తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్ధుల మధ్య మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉండగా, ఐసీసీ తేదీని మార్చింది. ఇప్పుడు ప్రపంచ కప్ (World Cup 2023)లో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ 24 గంటల ముందే నిర్వహించనున్నారు. అంటే 14న దాయాదిపోరు జరగనుంది. కాగా, క్రికెట్ చరిత్రలో ఇది ఐదోసారి జరగనుంది.
14వ తేదీన 5సారి తలపడనున్న భారత్-పాక్..
ఇంతకు ముందు 14వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య 4 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 2 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు గెలిచాయి. వన్డే క్రికెట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం 132 మ్యాచ్‌లు జరగ్గా.. ఇందులో భారత్ 55 మ్యాచ్‌లు గెలుపొందగా, పాకిస్తాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది. 4 మ్యాచ్‌లు ఫలితం ఇవ్వలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన 132 వన్డేల్లో 14వ తేదీన 4 మ్యాచ్‌లు జరిగాయి.




హెడ్ టు హెడ్ ఫలితాలు..
- 1997లో 14వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. 1997 సెప్టెంబర్ 14న టొరంటోలో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- 1997 డిసెంబరు 14న షార్జాలో 4 వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. గతంలో భారత్‌తో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.
- షార్జాలో విజయం సాధించిన ఒక నెల తర్వాత అంటే 14 జనవరి 1998న, ఢాకాలో భారత్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి, మరోసారి రివేంజ్ తీర్చుకుంది.
- 14 జూన్ 2008న, భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు మిర్పూర్‌లో తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ 25 పరుగుల తేడాతో గెలిచింది.
- ఇక 14 అక్టోబర్ 2023న చిరకాల ప్రత్యర్థుల పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై ఊహాగానాలు ఇప్పటికే మొదలయ్యాయి. తుది ఫలితం కోసం అప్పటి వరకు వేచి ఉండాల్సిందే మరి.
యాదృచ్ఛికం..
Updated fixtures have been revealed for CWC23
Details https://t.co/R1r9DaCQWC pic.twitter.com/Oj3bECcNhI
— ICC Cricket World Cup (@cricketworldcup) August 9, 2023
జూన్ 14, 2008 తర్వాత, హై వోల్టేజ్ మ్యాచ్ మరోసారి అక్టోబర్ 14, 2023న జరగనుంది. ఈ తేదీన జరిగే మ్యాచ్‌తో ఆసక్తికరమైన యాదృచ్చికం ఏర్పడుతుంది. 14న ఇరు దేశాల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా, నాలుగో మ్యాచ్‌లో పాకిస్థాన్ మళ్లీ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో 14న జరిగే ఐదో మ్యాచ్‌లో టీమిండియా విజయం ఖాయమని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




