Video: 27 బంతుల్లో 222 స్ట్రైక్ రేట్.. 2 ఫోర్లు, 6 సిక్సులతో ఊచకోత.. పాక్ బౌలర్‌ను చితక్కొట్టిన ప్లేయర్..
The Hundred: ఆగస్టు 9న ది హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ వర్సెస్ మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కంబ బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్ తుఫాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడిన క్లాసన్ కేవలం 27 బంతుల్లోనే 60 పరుగులతో బౌలర్లపై ఊచకోత కోశాడు. ముఖ్యంగా పాక్ ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఉసామా మీర్(Usama Mir)ను క్లాసెన్ చితక్కొట్టాడు.

హండ్రెడ్ లీగ్(The Hundred)లో ఆగస్టు 9న జరిగిన ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ (Oval Invincibles vs Manchester Originals) మధ్య జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) అర్ధ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తరపున ఆడిన క్లాసన్ కేవలం 27 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. మాంచెస్టర్ ఒరిజినల్స్ బౌలర్లలో ఎవరూ క్లాసెన్ బీభత్సాన్ని అడ్డుకోలేకపోయారు. ముఖ్యంగా పాక్ ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న ఉసామా మీర్(Usama Mir)ను క్లాసెన్ చితక్కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ హెన్రిక్ క్లాసెన్ తుఫాన్ బ్యాటింగ్‌తో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ జాసన్ రాయ్ 42 బంతుల్లో 59 పరుగులు చేయగా, మూడో స్థానంలో వచ్చిన హెన్రిక్ క్లాసెన్ 222.22 స్ట్రైక్ రేట్‌తో కేవలం 27 బంతుల్లో 6 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు.




ఖరీదుగా మారిన పాక్ బౌలర్..
ముఖ్యంగా పాక్ స్పిన్నర్ ఉసామా మీర్‌పై బౌండరీల వర్షం కురిపించిన ఓవల్ ఇన్విన్సిబుల్ జట్టు బ్యాటర్లు.. ఈ బౌలర్ వేసిన 10 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టారు. ఈ 10 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఆసియాకప్ 2023కు ఎన్నికైన ఆనందాన్ని ఈ బౌలర్‌కు లేకుండా చేశారు ఓవల్ ఇన్విన్సిబుల్ జట్టు బ్యాటర్లు.
కేవలం 92 పరుగులకే ఆలౌట్..
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు బ్యాటింగ్ విభాగం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయి 94 పరుగుల తేడాతో ఓడిపోయింది. జామీ ఓవర్టన్ 21 బంతుల్లో 37 పరుగులు చేసి జట్టు తరపున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్‌గా వచ్చిన జోస్ బట్లర్ 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మినహా జట్టులోని ఇతర బ్యాటర్లు ఎవరూ చెప్పుకోలేని స్థాయిలో రాణించలేకపోయారు. బౌలింగ్‌లో ఖరీదైన ఉసామా మీర్ 1 పరుగు మాత్రమే చేశాడు.
పాకిస్థాన్‌కు భారమేనా?
You won’t see many bigger hits than this at The Kia Oval! 😯
Huuuuuge from Heinrich Klaasen 😳#TheHundred pic.twitter.com/LmBY6AVSJf
— The Hundred (@thehundred) August 9, 2023
ఉసామా మీర్ ఈ ఏడాది పాకిస్థాన్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 6 వన్డే మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 43 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. మీర్ పాకిస్థాన్ తరపున ఇంకా టెస్టు, టీ20 ఆడలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
