T20 World Cup: క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ స్టార్ ప్లేయర్.. ఆస్పత్రికి తరలింపు
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం (ఫిబ్రవరి15) సాయంత్రం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ మ్యాచ్‌లో భారత మహిళలు చాలా సులభంగా గెలిచారు. అయితే ఈ మ్యాచ్‌లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం (ఫిబ్రవరి15) సాయంత్రం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ మ్యాచ్‌లో భారత మహిళలు చాలా సులభంగా గెలిచారు. అయితే ఈ మ్యాచ్‌లో ఒక అపశ్రుతి చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. గాయం తీవ్రంగా ఉండడంతో మైదానంలోకి స్ట్రెచర్ తీసుకురావాల్సి వచ్చింది. అనంతరం ఫిజియో కూడా వచ్చి టేలర్ పరిస్థితిని సమీక్షించాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఆ ఓవర్ ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ షార్ట్ ఫైన్ దిశగా ఆడింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలికి తీవ్రగాయమైంది. దీంతో మైదానంలో కూలబడిపోయింది. కనీసం పైకి లేవలేకపోయింది. దీంతో మెడికల్ సిబ్బంది వెంటనే ఆమెను స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. అయితే స్టెఫానీ టేలర్ గాయం గురించి ఎలాంటి తాజా అప్‌డేట్ లేదు. అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని తెలుస్తుంది. ఆయన వైద్యుల కట్టుదిట్టమైన పర్యవేక్షణలో ఉన్నారని తెలిసింది.
కాగా వెస్టిండీస్ జట్టులోని కీలక, అనుభవజ్ఞులైన క్రికెటర్లలో స్టెఫానీ ఒకరు. ఫీల్డింగ్‌లో గాయపడక ముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె సత్తా చాటింది. 6 ఫోర్ల సాయంతో 42 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడింది. తద్వారా వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరును సాధించడంలో తోడ్పాటు అందించింది. ఇప్పుడు టేలర్ టోర్నీలో ఆడకపోతే మాత్రం ప్రపంచకప్‌లో విండీస్ ఆశలకు గండిపడినట్లే. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది. దీప్తి శర్మ 3 వికెట్లతో రాణించింది. విండీస్ ప్లేయర్లలో టేలర్ (40 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇక 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం.
— MohiCric (@MohitKu38157375) February 15, 2023
?Medical Update? Stafanie Taylor is being evaluated by the match medical team and a further update will be given when more information is known.#T20WorldCup | #MaroonWarriors pic.twitter.com/ExDWSC9I2K
— Windies Cricket (@windiescricket) February 15, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..