Asia Cup Prize Money: ఆసియా కప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? షాకవుతున్న క్రికెటర్లు..

|

Jul 25, 2024 | 8:11 AM

Womens Asia Cup 2024 Prize Money: 2023లో పాకిస్థాన్‌, శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌లో ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచినందుకుగానూ భారత్‌కు కోటి 25 లక్షల రూపాయలు అందాయి. కాగా, రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు రూ.62 లక్షల 35 వేల ప్రైజ్ మనీ లభించింది. మహిళల ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే ఈ మొత్తం 7 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఈ గ్యాప్ తగ్గించేందుకు బీసీసీఐ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. బీసీసీఐ తన మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పురుషులతో సమానంగా చేసింది.

Asia Cup Prize Money: ఆసియా కప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?  షాకవుతున్న క్రికెటర్లు..
Womens Asia Cup 2024 Prize
Follow us on

Womens Asia Cup 2024 Prize Money: క్రికెట్‌లో ప్రస్తుతం డబ్బుల వర్షం కురుస్తోంది. ఈ ఆటలో ఆటగాళ్లపై కనక వర్షం కురుస్తుంది. ఇది ఒకవైపు మాత్రమే. పురుషుల క్రికెట్‌లో టోర్నీ గెలిచేందుకు కోట్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు మహిళల క్రికెట్‌లో టోర్నీ గెలిచిన జట్టుకు మాత్రం చాలా తక్కువ డబ్బు వస్తుంది. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ జట్టు ఫైనల్స్‌కు చేరుకుని ఆ తర్వాత టోర్నీలో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీలో టీమిండియా గెలిస్తే ఎంత డబ్బు వస్తుందనేది తెలుసుకుంటే.. ఆశ్చర్యపోతారు. మరి, మహిళల ఆసియా కప్ ప్రైజ్ మనీ ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆసియా కప్ గెలిచిన జట్టుకు ఏంత లభిస్తుంది?

మహిళల ఆసియా కప్ ప్రైజ్ మనీ చాలా తక్కువ. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఛాంపియన్ అయితే కేవలం 20 వేల డాలర్లు అంటే 16 లక్షల 48 వేల రూపాయలు మాత్రమే దక్కనున్నాయి. ఫైనల్లో ఓడిన జట్టుకు $12,500 అందుతుంది. అంటే, భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.10 లక్షల 30 వేలు అన్నమాట.

పురుషుల ఆసియా కప్‌లో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు?

2023లో పాకిస్థాన్‌, శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌లో ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచినందుకుగానూ భారత్‌కు కోటి 25 లక్షల రూపాయలు అందాయి. కాగా, రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు రూ.62 లక్షల 35 వేల ప్రైజ్ మనీ లభించింది. మహిళల ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే ఈ మొత్తం 7 రెట్లు ఎక్కువ. ఇప్పుడు ఈ గ్యాప్ తగ్గించేందుకు బీసీసీఐ ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. బీసీసీఐ తన మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజును పురుషులతో సమానంగా చేసింది. అయితే, ఇప్పుడు టోర్నమెంట్లు, సిరీస్‌ల ప్రైజ్ మనీని పెంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..