Shardul Thakur : గబ్బాలో చరిత్ర సృష్టించాం.. ఆ క్షణాల్ని ఎంతో ఆస్వాదించాం.. టీం ఇండియా ప్లేయర్ భావోద్వేగం..
Shardul Thakur Coments :కంగారుల గడ్డపై టెస్టు సిరీస్ గెలిచాక జట్టు సభ్యులమంతా భావోద్వేగానికి గురయ్యామని టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చెబుతున్నాడు.
Shardul Thakur Coments :కంగారుల గడ్డపై టెస్టు సిరీస్ గెలిచాక జట్టు సభ్యులమంతా భావోద్వేగానికి గురయ్యామని టీమిండియా ఆటగాడు శార్దూల్ ఠాకూర్ చెబుతున్నాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గబ్బా టెస్ట్‌లో గెలిచాక జాతీయ జెండాను చేతబూని మైదానంలో తిరిగినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నాడు. ఆ క్షణాన జట్టు సభ్యులంతా ఎంతో భావోద్వేగానికి గురయ్యారని చెప్పాడు.
ఆస్ట్రేలియాలోనూ ఎంతో మంది భారతీయులు మాకు మద్దతుగా నిలిచారని స్టేడియానికి వచ్చి ప్రోత్సహించారని పేర్కొన్నాడు. వారికి ధన్యవాదాలు తెలపడం మా బాధ్యత అంటూ గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి విమర్శకుల నోళ్లు మూయించామని సమాధానమిచ్చాడు. మొదటగా అడిలైట్ టెస్ట్‌తో మేము 0-4తో సిరీస్ కోల్పోతామని భావించామని కానీ ధైర్యం తెచ్చుకొని మెల్‌బోర్న్ టెస్టులో విజయం సాధించామని పేర్కొన్నాడు. ఆ తర్వాత అద్భుత పోరాట పటిమతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించామన్నాడు. ఇక గబ్బాలో చరిత్ర సృష్టించామని గొప్పగా చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.