ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల దూకుడు.. టాప్ ప్లేస్‌లో కోహ్లీ, రోహిత్​, బుమ్రా

టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ అగ్రస్థానంలో దక్కించుకున్నారు. ఐసీసీ (ICC) తాజా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో ఆదిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్​ విభాగంలో..

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల దూకుడు.. టాప్ ప్లేస్‌లో కోహ్లీ, రోహిత్​, బుమ్రా
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 27, 2021 | 8:52 PM

ICC ODI Rankings : టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ అగ్రస్థానంలో దూసుకుపోతున్నారు. ఐసీసీ (ICC) తాజా ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో ఆదిపత్యాన్ని తిరిగి దక్కించుకున్నారు. బ్యాటింగ్​ విభాగంలో భారత కెప్టెన్​, వైస్​ కెప్టెన్​లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బౌలర్ల జాబితాలో పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా మూడో స్థానంలో ఉండగా.. ఆల్​రౌండర్లలో రవీంద్ర జడేజా, హర్దిక్​ పాండ్య టాప్​-20లో ఉన్నారు. ఇక పాకిస్తాన్ కెప్టెన్​ బాబార్​ అజామ్​ 837 పాయిట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు. రాస్​ టేలర్ ​(818), ఆరోన్​ ఫించ్​(791) టాప్​-5లో ఉన్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్​లో న్యూజిలాండ్​ పేసర్​ ట్రెంట్​ బౌల్ట్​(722) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. సెకెండ్ ప్లేస్‌లో అఫ్గాన్​ బౌలర్​ ముజీబ్​ ఉర్​ రెహమాన్​ (701) ఉన్నాడు. అయితే భారత పేసర్​ బుమ్రా(700) మూడో స్థానంలో  కొనసాగుతున్నాడు.

ఇక విండీస్​తో జరిగిన సిరీస్​లో విజయవంతమైన బంగ్లాదేశ్​ స్పిన్నర్​ మెహిదీ హసన్​ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని.. కెరీర్​ బెస్ట్​ ర్యాంక్​ నాలుగో స్థానంలో నిలిచాడు. 19వ స్థానంలో ఉన్న బంగ్లా పేసర్​ ముస్తాఫిజుర్​ రహమాన్​ 8వ స్థానంకు చేరుకున్నాడు.