49 ఫోర్లు, 4 సిక్సర్లు.. 379 రన్స్‌తో రికార్డులు బద్దలు.. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన యంగ్ సెన్సేషన్‌

శ్రీలంకతో సిరీస్‌ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇందుకోసం మరికొన్ని గంటల్లోనే భారత జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఈనేపథ్యంలో షా పేరును కూడా సెలెక్షన్‌ ప్రక్రియలోకి తీసుకుంటారని తెలుస్తోంది.

49 ఫోర్లు, 4 సిక్సర్లు.. 379 రన్స్‌తో రికార్డులు బద్దలు.. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన యంగ్ సెన్సేషన్‌
India Vs New Zealand
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2023 | 7:28 PM

383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్లు, 379 పరుగులు.. రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ముంబై క్రికెటర్‌ పృథ్వీ షా సాధించిన పరుగులివి. ఈ ట్రిపుల్‌ సెంచరీ కారణంగానే ముంబై ఇన్నింగ్స్‌ 128 పరుగుల తేడాతో అస్సాంను మట్టికరిపించింది. ఈ భారీ ఇన్నింగ్స్‌తో దేశవాళీ క్రికెట్‌లో పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు పృథ్వీ షా. అయితే గత కొంతకాలంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు షా. మరి ఈ రికార్డు ఇన్నింగ్స్‌తోనైనా సెలెక్టర్లు షాపై కరుణిస్తారా? లేదా?అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మరో 48 గంటల్లో పృథ్వీ షా ఒక శుభవార్త వినవచ్చు. అదేంటంటే.. శ్రీలంకతో సిరీస్‌ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌తో వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇందుకోసం మరికొన్ని గంటల్లోనే భారత జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ. ఈనేపథ్యంలో షా పేరును కూడా సెలెక్షన్‌ ప్రక్రియలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కాగా జనవరి 18- ఫిబ్రవరి 1 వరకు భారత్‌లో పర్యటించనుంది న్యూజిలాండ్‌. మొదట వన్డే సిరీస్‌తో ఆతర్వాత టీ20 సిరీస్‌ ఆడనుంది. జనవరి 18 నుంచి వన్డే సిరీస్, జనవరి 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. జనవరి 27న రాంచి వేదికగా టీమిండియా- కివీస్‌ జట్ల మధ్య పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌ మొదలు కానుంది. జనవరి 29, ఫిబ్రవరి 1న మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

కాగా ఈ రెండు సిరీస్‌లకు షా సరిగ్గా సరిపోతాడని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. పృథ్వీ షా చాలా దూకుడుగా ఆడే బ్యాటర్‌. క్రీజులో కుదురుకుంటే చాలు ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునీయులు చేసే సామర్థ్యముంది. దీనికి తోడు ఈసారి వన్డే ప్రపంచకప్‌ భారత్‌లోనే జరగాల్సి ఉంది. కాబట్టి షాను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఓపెనింగ్‌ స్లాట్లో పోటీ ఎక్కువగా ఉండటం షాకు సమస్యగా మారింది. ఇప్పుడు గిల్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌, ధావన్, రాహుల్‌ కూడా ఓపెనింగ్ కోసం పోటీ పడుతున్నారు. కాగా షా 2021, జూలై 25 నుండి టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నారు. అయితే 379 పరుగుల ఇన్నింగ్స్‌తో మరోసారి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడీ యంగ్ సెన్సేషన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..