IND vs SL: సెంచరీ ఓకే.. మరి బంగ్లాదేశ్‌పై ఓటమి సంగతేంటో.. విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ గంభీర్ షాకింగ్ కామెంట్స్
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. రెండో మ్యాచ్‌లో గెలుపు కోసం టీమిండియా అష్టకష్టాలు పడినా మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించింది. అందుకు ప్రత్యేక కారణం విరాట్ కోహ్లీ సెంచరీ.
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల వైరం ఈనాటిది కాదు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా మైదానంలోనే వీరు గొడవకు దిగడం ఎవరూ మర్చిపోలేరు. ఆతర్వాత కూడా సోషల్ మీడివయా వేదికగా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈక్రమంలో ఇప్పటికీ కూడా విరాట్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటాడు గంభీర్. ఇటీవల లంకతో వన్డే మ్యాచ్ ముగిసిన తర్వాత చాలామంది సచిన్‌తో కోహ్లీని పోల్చడం, టెండూల్కర్ రికార్డులను విరాట్ బద్దలుకొడతాడని చర్చ జరిగినప్పుడు గంభీర్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. కాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. రెండో మ్యాచ్‌లో గెలుపు కోసం టీమిండియా అష్టకష్టాలు పడినా మొదటి వన్డేలో అద్భుత విజయం సాధించింది. అందుకు ప్రత్యేక కారణం విరాట్ కోహ్లీ సెంచరీ. ఈ సెంచరీ ఆధారంగానే టీమ్ ఇండియా భారీ స్కోరు నమోదు చేసి లంకపై ఒత్తిడి పెంచింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత చాలామంది కోహ్లీని సచిన్‌తో పోల్చారు. టెండూల్కర్ సెంచరీ రికార్డులను బద్దలు కొడతాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే వీటిపై కూడా ఘాటుగా స్పందించాడు గంభీర్. సచిన్ ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరంటూ విరాట్‌ను తక్కువ చేసి మాట్లాడాడు. ఇక రెండో వన్డేలో విరాట్ నిరాశపర్చాడు. తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో మరోసారి విరాట్‌ను టార్గెట్ చేశాడు గంభీర్.
‘క్రికెట్‌లో వ్యక్తిగత రికార్డులు కూడా ముఖ్యమే. సెంచరీ లేదా అర్ధసెంచరీ సాధించినప్పుడు అది మనకు మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే అది జట్టుకు ఏ మేర ఉపయోగపడిందో ఆలోచించుకోవాలి. ఇప్పుడైతే టీమిండియా లంకపై విజయం సాధించింది. కానీ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మనం ఓడిపోయామన్న విషయాన్ని మరచిపోకూడదు. పైగా ఆ సిరీస్‌లో టీమిండియా దాదాపు పూర్తి స్థాయి జట్టుతోనేన బరిలోకి దిగింది. అయినా సిరీస్‌ను కోల్పోయింది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఓటమి నుంచి మనకు ఓ గొప్ప పాఠం. సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అంటూ పరోక్షంగా విరాట్‌పై విమర్శలు గుప్పించాడు గంభీర్. ఇక ఈ సిరీస్‌లో నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం (జనవరి 15)న జరగనుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంకేయులు భావిస్తున్నారు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..