AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: డ్యాన్స్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి తీన్మార్‌ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

మ్యాచ్‌ తర్వాత జరిగిన సెలబ్రేషన్స్‌లో కోహ్లీ రెచ్చిపోయాడు. బౌండరీ లైన్‌ దగ్గర ఇషాన్‌ కిషన్‌తో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశాడు. వీరిద్దరిని చూస్తూ సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్‌ కూడా కేరింతలు కొడుతూ మరింత ఎంకరేజ్‌ చేశారు.

IND vs SL: డ్యాన్స్‌తో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌తో కలిసి తీన్మార్‌ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
Ishan Kishan, Virat Kohli
Basha Shek
|

Updated on: Jan 13, 2023 | 5:03 PM

Share

టీమిండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో బయట అంతే సరదాగా ఉంటాడు. ముఖ్యంగా తన సహచరులతో కలిసి ఎంతో కలివిడిగా ఉంటాడు. అప్పుడప్పుడు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటుంటాడు. అలాగే ఇతరులను ఇమిటేట్‌ చేస్తూ ఆటపట్టిస్తుంటాడు. ఈనేపథ్యంలో మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టేశాడు మన రన్‌ మెషిన్‌. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా లంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ తర్వాత జరిగిన సెలబ్రేషన్స్‌లో కోహ్లీ రెచ్చిపోయాడు. బౌండరీ లైన్‌ దగ్గర ఇషాన్‌ కిషన్‌తో కలిసి తీన్మార్ స్టెప్పులు వేశాడు. వీరిద్దరిని చూస్తూ సహచర క్రికెటర్లు, ఫ్యాన్స్‌ కూడా కేరింతలు కొడుతూ మరింత ఎంకరేజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కోహ్లీ, ఇషాన్‌ల స్టెప్పులకు క్రికెట్‌ ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్ మిగిలి ఉంది కానీ టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సేన తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని టీమ్ అంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే విరాట్, ఇషాన్‌లు కలిసి స్టెప్పులేశారు.

కాగా గౌహతిలో జరిగిన తొలి వన్డేలో విరాట్ సెంచరీ సాధించాడు. నాలుగేళ్ల తర్వాత భారత్‌లో అతనికిదే తొలి సెంచరీ. అయితే రెండో మ్యాచ్‌లో విరాట్ నిరాశపరిచాడు. తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తన చివరి వన్డేలో ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు ఇషాన్‌ కిషన్‌. అయితే శుభ్‌మన్‌ గిల్‌ నిలకడగా రాణిస్తుండడంతో రెండు మ్యాచ్‌ల్లోనూ డగౌట్‌కే పరిమితమయ్యాడీ యంగ్ సెన్సేషన్‌. ఇక ఈ సిరీస్‌లో నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం (జనవరి 15)న జరగనుంది. కేరళ రాజధాని తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇందులోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేయాలని టీమిండియా భావిస్తుండగా, కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంకేయులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్