IND vs NZ 3rd T20I Match Prediction: క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్, చివరి మ్యాచులోనైనా గెలిచేందుకు కివీస్.. హోరాహొరీగా పోరు..!
Today Match Prediction of India vs New Zealand: భారత్, కివీస్ టీంలు ఇప్పటి వరకు 19 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 8, న్యూజిలాండ్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇందులో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
India vs New Zealand, 3rd T20I: సిరీస్‌లో చివరి టీ20లో భారత్ అత్యద్భుతంగా బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ అండ్ కో తమ ప్రత్యర్థులను వైట్‌వాష్ చేసే లక్ష్యంతో మూడవ T20Iలోకి ప్రవేశించనున్నారు. భారత్‌కు ఓపెనర్లు సిరీస్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. మొదటి T20Iలో, రోహిత్-రాహుల్ ద్వయం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండవ T20Iలో అంతకుమించి ఆడారు. 154 పరుగుల లక్ష్యాన్ని తేలికగా చేయడంలో భారత్‌కు సహాయపడటానికి సెంచరీ బాగస్వామ్యాన్ని అందించారు.
కివీస్ ఓపెనర్ల అద్భుతమైన ప్రదర్శన ఈ సిరీస్‌ను భారత్‌పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం. హర్షల్ పటేల్ భారత్ తరపున డెబ్యూ మ్యాచులోనే అదరగొట్టాడు. బంతితో 2 వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శనలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
కివీస్‌కు కూడా టాప్ ఆర్డర్‌పైనే భారం ఉంచుకుంది. మొదటి T20Iలో, మార్టిన్ గప్టిల్, మార్క్ చాప్‌మన్ రెండవ వికెట్‌కు 109 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, రెండవ టీ20ఐలో బ్లాక్ క్యాప్స్ ఓపెనర్లు 4.2 ఓవర్లలో 48 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ కివీస్‌ను నిరాశపరిచింది. ఆఖరి పోరులో మిడిల్ ఆర్డర్ సత్తా చూపిస్తుందని న్యూజిలాండ్ భావిస్తోంది.
చివరి టీ20లో న్యూజిలాండ్ ‘మెన్ ఇన్ బ్లూ’ వైట్‌వాష్‌ను నివారించాలని చూస్తోంది. బ్లాక్ క్యాప్స్ అలా చేయడంలో విజయం సాధిస్తుందా లేదా సిరీస్‌లో భారత్ ముందు మరోసారి ఓడిపోతుందేమో చూడాలి.
ఎప్పుడు: నవంబర్ 21, ఆదివారం రాత్రి 7 గంటలకు
ఎక్కడ: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
పిచ్: తొలి రెండు టీ20ఐలలో చూసినట్లుగా కోల్‌కతాలో కూడా మంచు ఒక కారకంగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌ను ఇష్టపడుతుంది. అయితే ఈ సిరీస్‌లో భారత్ మూడోసారి టాస్ గెలిస్తే, అననుకూల పరిస్థితుల్లో తమ లైనప్‌ను పరీక్షించడానికి వారు మొదట బ్యాటింగ్ చేయాలనుకునే అవకాశం ఉంది.
టీమ్ న్యూస్ ఇండియా: సిరీస్ టీమిండియా చేజిక్కించుకోవడంతో తమ ప్లేయింగ్‌లో XIలో మార్పులు చేసే అవకాశం ఉంది. అవేశ్ ఖాన్ లాంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లలో కొందరికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్‌కి విశ్రాంతి ఇవ్వవచ్చు. టాప్ 3లో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. హర్షల్ పటేల్ ఇప్పటికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో అరంగేట్రంలో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్‌ను చివరి గేమ్‌లో తీసుకోవచ్చు. యుజ్వేంద్ర చాహల్ కూడా మూడో టీ20లో బరిలోకి దిగే అవకాశం ఉంది.
టీమిండియా ప్లేయింగ్ XIఅంచనా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్/రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ఇషాన్ కిషన్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్/అవేష్ ఖాన్
న్యూజిలాండ్: న్యూజిలాండ్ టీం అదే టీంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టీ20లో మార్పులు చేసినా ఓటమి పాలైంది. అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత రెండవ గేమ్‌లో విశ్రాంతి తీసుకున్న ఆడమ్ మిల్నే కోసం లాకీ ఫెర్గూసన్‌ను ఫైనల్ మ్యాచులో తిరిగి తీసుకునే ఛాన్స్ ఉంది.
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI అంచనా: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్/ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్
మీకు తెలుసా? – T20Iలలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా పేరుగాంచిన రోహిత్, రాహుల్ జోడీ అగ్రస్థానంలో నిలిచేందుకు మరో 200 కంటే తక్కువ పరుగుల దూరంలో ఉన్నారు. ఇప్పటి వరకు 1000+ భాగస్వామ్య పరుగులతో నిలిచిన 11 జోడీల్లో తొలిస్థానంలో రోహిత్, రాహుల్ నిలవనున్నారు. ఈ ఇద్దరి జోడీ కంటే వేరెవరూ వేగంగా పరుగులు చేయలేదు. – రుతురాజ్ & అవేష్ ఖాన్ ఐపీఎల్ 2021లో భారతదేశం తరపున T20లలో వరుసగా అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ప్లేయర్లుగా నిలిచారు.
స్క్వాడ్‌లు: భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(కీపర్), శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్, అవేష్ ఖాన్, ఇషాన్ కిషన్ , మహమ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్
న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ(కెప్టెన్), ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్, టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, రాచిన్ రవీంద్ర
Also Read: 8 బంతుల్లో సినిమా చూపించాడు.. 23 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.. భయంకర బ్యాట్స్‌మెన్..?