AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ Predicted Playing 11: చివరి పోరులో ప్రయోగాలకు శ్రీకారం.. ‘బెంచ్‌’కు పరీక్ష.. ప్లేయింగ్‌ XIలో కొత్తగా చేరేది ఎవరంటే?

India vs New Zealand: భారత్, కివీస్ టీంలు ఇప్పటి వరకు 19 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 8, న్యూజిలాండ్ 9 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇందులో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.

IND vs NZ Predicted Playing 11: చివరి పోరులో ప్రయోగాలకు శ్రీకారం.. 'బెంచ్‌'కు పరీక్ష.. ప్లేయింగ్‌ XIలో కొత్తగా చేరేది ఎవరంటే?
Ind Vs Nz, 3rd T20i Predicted Playing Xi
Follow us
Venkata Chari

|

Updated on: Nov 21, 2021 | 9:11 AM

IND vs NZ 3rd T20I Playing 11: టీమిండియా ఐదవ వరుస ద్వైపాక్షిక స్వదేశీ సిరీస్ విజయం సాధించారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రాంచీలో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో ఫైనల్‌ మ్యాచులో న్యూజిలాండ్‌ హామీ తుమీ తేల్చుకోనుంది. అయితే ఈ మ్యాచులో 2022లో రానున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

రోహిత్-ద్రవిడ్ సారథ్యంలో వచ్చిన మార్పులు అందరికీ తెలిసిందే. ఆర్. అశ్విన్, నాలుగేళ్ల తర్వాత T20I ఫోల్డ్‌కి తిరిగి రావడం గమనించవచ్చు. పవర్‌ప్లేలో బౌలింగ్ చేయడంతో పాటు స్కోరింగ్‌ను అరికట్టడానికి తన తెలివిని ఉపయోగించాడు. 2-23, 1-19 గణంకాలతో అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కోసం పోటీలో ఉన్నాడు. అతను తిరిగి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 5.25 ఎకానమీ రేటుతో 11.66 వద్ద 9 వికెట్లు పడగొట్టాడు.

IND vs NZ హెడ్-టు-హెడ్ మొత్తం.. మ్యాచ్‌లు- 19, భారత్ – 8, న్యూజిలాండ్ – 9, టై- 2

భారతదేశంలో.. మ్యాచ్‌లు- 7, భారత్ – 4, న్యూజిలాండ్- 3

ఇండియా vs న్యూజిలాండ్ ప్రసార వివరాలు: ఎప్పుడు: నవంబర్ 21, ఆదివారం రాత్రి 7 గంటలకు

ఎక్కడ: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.

టీమిండియా: ఈ సిరీస్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఓపెనర్లు బలమైన ఓపెనింగ్‌ ఇస్తేనే మిడిలార్డర్‌పై భారం తెలియకుండా ఉంది. అయితే ఓపెనర్లు విఫలమైతే మాత్రం మిడిలార్డర్ విఫలమవతున్న విషయంతో ద్రవిడ్ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను గెలుచుకున్నందున, ‘మెన్ ఇన్ బ్లూ’ కొన్ని ప్రయోగాలతో మూడో టీ20లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టులో అవకాశం లభించవచ్చు. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్‌కు కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అవేష్ ఖాన్ కూడా అరంగేట్రం చేయవచ్చని తెలుస్తోంది.

టీమిండయా ప్లేయింగ్ XI అంచనా: కేఎల్ రాహుల్/రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (కీపర్), శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్/అవేష్ ఖాన్, హర్షల్ పటేల్

న్యూజిలాండ్: న్యూజిలాండ్ టీం రెండో టీ20ఐ మ్యాచ్‌లో ఆడిన అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కివీస్ ఇప్పటికే రెండో మ్యాచ్‌లో తమ జట్టులో 3 మార్పులు చేసింది. చివరి పోరు కోసం ఇదే జట్టుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI అంచనా: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సిఫెర్ట్ (కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ (కెప్టెన్), ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

Also Read: IND vs NZ 3rd T20I Match Prediction: క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్, చివరి మ్యాచులోనైనా గెలిచేందుకు కివీస్.. హోరాహొరీగా పోరు..!

IND vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్లను హెచ్చరించిన బీసీసీఐ అధ్యక్షుడు.. ఈడెన్ పిచ్‌‌పై‌ ఏమన్నాడంటే?