AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs SL T20 World Cup 2021 Match Prediction: అసలైన పోరుకు ఆస్ట్రేలియా, శ్రీలంక టీంలు సిద్ధం.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Today Match Prediction of AUS vs SL: టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మూడు సార్లు తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచుల్లో ఆస్ట్రేలియా, ఒక మ్యాచులో శ్రీలంక విజయం సాధించాయి.

AUS vs SL T20 World Cup 2021 Match Prediction: అసలైన పోరుకు ఆస్ట్రేలియా, శ్రీలంక టీంలు సిద్ధం.. ఇరుజట్ల బలాలు, రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Aus Vs Sl T20 World Cup 2021
Venkata Chari
|

Updated on: Oct 28, 2021 | 7:38 AM

Share

AUS vs SL T20 World Cup 2021 Match Prediction: ఆస్ట్రేలియా, శ్రీలంక సూపర్ 12 క్యాంపెయిన్‌లను విజయవంతంగా ప్రారంభించాయి. రెండు జట్లు టీ20 ప్రపంచ కప్ 2021 ఎడిషన్ 22వ మ్యాచ్‌లో ఒకదానితో ఒకటి తలపడతాయి. దుబాయ్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక జట్లు ఈ రోజు తలపడనున్నాయి.

పిచ్, పరిస్థితులు: దుబాయ్‌లోని పిచ్‌లో బ్యాట్స్‌మెన్ ప్రారంభంలో ఓపికగా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. టోర్నీలో ఇప్పటి వరకు ఈ వేదికపై ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది.

ఆస్ట్రేలియా vs శ్రీలంక హెడ్-టు-హెడ్

మ్యాచ్‌లు- 16, ఆస్ట్రేలియా – 8, శ్రీలంక – 8

టీ20 ప్రపంచకప్‌లో

మ్యాచ్‌లు- 3, ఆస్ట్రేలియా – 2, శ్రీలంక – 1

ఆస్ట్రేలియా vs శ్రీలంక లైవ్

మ్యాచ్ సమయాలు – రాత్రి 07:30 గంటలకు

లైవ్ – స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా జట్టు తమ ఓపెనింగ్‌లో దక్షిణాఫ్రికాను చేతిలో 5 వికెట్లతో ఓడించింది. ఆసీస్ బౌలింగ్ విభాగం బాగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికా జట్టుని 118/9కి పరిమితం చేసింది. ఆ తరువాత ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఎలాంటి టెన్షన్ లేకుండా టార్గెట్‌ను చేరుకుంది.

ఆసీస్ బ్యాటింగ్ విభాగం మంచి ప్రదర్శన చేసింది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్స్ 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు. వారి బ్యాటింగ్‌లో టాలిస్మాన్, స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో జట్టుకు కావాల్సిన పరుగులు చేశారు.

మొదటి వార్మప్‌లో భారత్‌పై స్మిత్ 57 పరుగులు చేయగా, రెండో వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై కుడిచేతి వాటం ఆటగాడు 30 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాపై స్మిత్ 35 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ ఐదు బంతుల్లో డకౌట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ కూడా తాను ఆడిన 3 ఇన్నింగ్స్‌లలో (2 వార్మప్ మ్యాచ్‌ల్లో 1, 12 పరుగులు) 20 పరుగుల మార్కును దాటలేకపోయాడు.

గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇన్నింగ్స్ చివరిలో చెలరేగి ఆడుతున్నారు. ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని జట్టు బౌలింగ్ విభాగం కూడా మంచి ఫామ్‌లో ఉంది.

ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో (వార్మప్‌తో సహా) ఆసీస్ బౌలర్లు 18 వికెట్లు పడగొట్టారు. మరోవైపు, బంగ్లాదేశ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక జట్టు ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగనుంది.

శ్రీలంక: చరిత్ అసలంక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ టైగర్స్‌పై 49 బంతుల్లో 80 (నాటౌట్) పరుగులు చేయడం ద్వారా శ్రీలంక జట్టును ఒంటరిగా విజయతీరాలకు చేర్చాడు. భానుక రాజపక్స అసలంకకు మంచి మద్దతునిచ్చాడు. 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు.

కుశాల్ పెరీరా ఫామ్ శ్రీలంక జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ టోర్నీలో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 3లో 20కి మించి స్కోర్ చేయడంలో విఫలమయ్యాడు. పాతుమ్ నిస్సాంక కూడా 4 మ్యాచ్‌లలో రెండు సింగిల్ డిజిట్ స్కోర్‌లను నమోదు చేశాడు.

భానుక రాజపక్సే శ్రీలంకకు చాలా కీలకంగా మారాడు. శ్రీలంక స్పిన్ బౌలింగ్ విభాగం బంతితో చక్కటి ప్రదర్శన చేసింది. వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, లహిరు కుమార స్పిన్ త్రయం క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో పొదుపుగా బౌలింగ్ చేశారు.

మీకు తెలుసా? 39 – 1500 టీ20ఐ పరుగులు పూర్తి చేసిన రెండవ శ్రీలంక బ్యాటర్‌గా కుశాల్ పెరీరాకు 39 పరుగులు అవసరం.

1 -పెరీరా టీ20ఐలలో 50 సిక్సర్లు పూర్తి చేయడానికి ఒక సిక్సర్ అవసరం.

2 – పెరెరా రెండు సిక్సర్లు కొడితే, అతను టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు పూర్తి చేస్తాడు.

4 – అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేయడానికి లహిరు కుమారకు నాలుగు వికెట్లు అవసరం.

27 – ఆరోన్ ఫించ్ 2500 టీ20ఐ పరుగులు పూర్తి చేసిన ఐదవ బ్యాటర్‌గా అవతరించడానికి 27 పరుగులు కావాలి.

1 – షేన్ వాట్సన్ తర్వాత 400 సిక్సర్లు పూర్తి చేసిన రెండో ఆస్ట్రేలియన్‌గా అవతరించడానికి ఫించ్‌కి ఒక సిక్సర్ అవసరం.

7 – ఆరోన్ ఫించ్ తర్వాత టీ20ఐలలో 100 సిక్సర్లు పూర్తి చేసిన రెండవ ఆస్ట్రేలియన్‌గా అవతరించడానికి గ్లెన్ మాక్స్‌వెల్‌కు ఏడు సిక్సులు కావాలి.

12 – అంతర్జాతీయ క్రికెట్‌లో 1500 పరుగులు పూర్తి చేయడానికి దసున్ షనకకు 12 పరుగులు అవసరం.

42 – మాథ్యూ వేడ్ టీ20 క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేయడానికి 42 పరుగులు కావాలి.

51 – టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి అష్టన్ అగర్‌కు 51 పరుగులు అవసరం.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI అంచనా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

మహేశ్ తీక్షణ ఫిట్‌గా ఉంటే బినురా ఫెర్నాండో స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన లైనప్ అలాగే ఉంటుంది.

శ్రీలంక ప్లేయింగ్ XI అంచనా: కుసల్ పెరెరా (కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో/మహీష్ తీక్షణ

Also Read: T20 World Cup: బోణీ కొట్టిన నమీబియా.. స్కాట్లాండ్‌పై సునాయాస విజయం.

T20 World Cup 2021: ప్రాక్టిస్ సెషన్‎కు హాజరైన టీం ఇండియా.. ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసిన కోచ్ రవి శాస్త్రి..