జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? వెలుగులోకి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ..!
Yashasvi Jaiswal Girlfriend: భారత యువ క్రికెట్ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున పరుగుల వరద పారిస్తున్నాడు. మైదానంలో తన బ్యాట్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్న ఈ యువ ఆటగాడు, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు. యశస్వి ఎవరితో ప్రేమలో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడంతో అభిమానులు ఆరా తీస్తున్నారు.

Yashasvi Jaiswal Girlfriend: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లలోనే 93 పరుగులు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ ప్రేమ కథ ఇప్పుడు బయటపడింది. యశస్వి ఒక విదేశీ యువతితో పదేపదే కనిపిస్తుండటంతో ఆమె ఎవరా అని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. సమాచారం ప్రకారం, ఆమె పేరు మ్యాడీ హామిల్టన్. బ్రిటన్ దేశానికి చెందిన ఈ సుందరితో యశస్వి గత నాలుగేళ్లుగా గాఢమైన ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరీ మ్యాడీ హామిల్టన్?
మ్యాడీ హామిల్టన్ గురించి ఇంటర్నెట్‌లో పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, ఆమె యశస్వికి అత్యంత సన్నిహితురాలని స్పష్టమవుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు గతంలోనే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మ్యాడీ సోదరుడిని యశస్వి ‘చిన్న తమ్ముడు’ అని సంబోధిస్తుంటారని, ఆమె కుటుంబంతో కూడా జైస్వాల్‌కు మంచి అనుబంధం ఉందని సమాచారం. 2022 సంవత్సరంలోనే వీరిద్దరూ మొదటిసారి కలిసి కనిపించినట్లు తెలుస్తోంది.
స్టేడియంలో సందడి.. ఫ్లయింగ్ కిస్ వైరల్..!
2024 ఐపీఎల్ సమయంలో మ్యాడీ రాజస్థాన్ రాయల్స్ జట్టును ప్రోత్సహించడానికి స్టేడియానికి రావడంతో తొలిసారిగా వెలుగులోకి వచ్చారు. అయితే, 2025 ఆగస్టులో జరిగిన ఒక సంఘటన వీరి బంధాన్ని ధృవీకరించింది. ఓవల్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో యశస్వి శతకం బాదిన తర్వాత, స్టాండ్స్‌లో కూర్చున్న మ్యాడీ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం, హార్ట్ ఎమోజీ చూపించడం కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యింది.
కెరీర్, వ్యక్తిగత జీవితం..
24 ఏళ్ల యశస్వి జైస్వాల్ అతి తక్కువ కాలంలోనే టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా ఎదిగారు. తన కష్టంతో పేదరికం నుంచి స్టార్ క్రికెటర్‌గా మారిన జైస్వాల్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉన్నారని ఈ వార్తలు సూచిస్తున్నాయి. వారిద్దరి మధ్య ప్రేమ కథ ఎలా మొదలైందనే దానిపై పూర్తి వివరాలు లేనప్పటికీ, వీరిద్దరూ ఒకరికొకరు ఎంతో అండగా నిలుస్తున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
