లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లీ ఇన్నింగ్స్ ఎవరికైనా గుర్తుందా? అయితే ప్రస్తుతం అయన ఆరోగ్య సమస్యలతో సతమవుతున్నాడు. ఇటీవలే గురు రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో కాంబ్లీ తన ప్రాణ స్నేహితుడు సచిన్‌ను కలిసిన ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియోలో కాంబ్లీ కూర్చున్న స్థానం నుండి లేవలేని స్థితిలో కనిపించాడు. దీంతో నెటిజన్లు కాంబ్లీకి ఏమైంది అని నెటింట్లో కామెంట్లు పెడుతున్నారు. వినోద్ కాంబ్లీకి ఉన్న వ్యాధి ఏమిటో చూద్దాం..
వినోద్ కాంబ్లీకి అనారోగ్య సమస్యలు కొత్తేమీ కాదు. 2013లో వినోద్ కాంబ్లీ కారు నడుపుతూ గుండెపోటుకు గురయ్యాడు. 2012లో కాంబ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. కొన్ని రోజులు కాంబ్లీ డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని వినోద్ కాంబ్లీ ఒకసారి బహిరంగంగానే చెప్పాడు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డీ అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తుంది.
దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కాంబ్లీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో కాంబ్లీ అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించింది. దీంతో ఈ విషయం సర్వత్రా చర్చాంశనీయమైంది. వినోద్ అనేక తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నాడని అతని స్నేహితుడు అంపైర్ కుటో తెలిపాడు. పునరావాస కేంద్రానికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, కాంబ్లీ 14 సార్లు పునరావాస కేంద్రానికి వెళ్లినట్లు చెప్పాడు. మూడుసార్లు మేమే వాసాయ్‌లోని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లామని వెల్లడించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి