AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్‌.. 27 పరుగులకే ఆలౌట్‌.. 7 మంది డకౌట్‌! టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అతి చెత్త రికార్డ్‌..

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది, ఇది వారి క్రికెట్ చరిత్రలో రెండవ అతి తక్కువ స్కోరు. ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో 6 వికెట్లు తీశాడు.

షాకింగ్‌.. 27 పరుగులకే ఆలౌట్‌.. 7 మంది డకౌట్‌! టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అతి చెత్త రికార్డ్‌..
Aus Vs Wi
SN Pasha
|

Updated on: Jul 15, 2025 | 8:39 AM

Share

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ చెత్త రికార్డ్‌ నమోదైంది. జమైకాలోని సబినా క్రికెట్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మిగిలిన నలుగురిలో ముగ్గురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. వెస్టిండీస్‌ 27 పరుగుల ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా పరుగులే రెండో అత్యధిక స్కోర్‌. ఆస్ట్రేలియా బౌలర్లు 6 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. అవి కూడా ఇవ్వకుంటే.. వెస్టిండీస్‌ కేవలం 21 పరుగులకే కుప్పకూలేది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ నిప్పులు చెరిగాడు.

7.3 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి.. వెస్టిండీస్‌ ఓటమిని శాసించాడు. అతనేసిన వాటిలో 4 ఓవర్లు మెయిడిన్‌ ఓవర్లు. అలాగే స్కాట్‌ బొలాండ్‌ 2 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. జోస్‌ హెజల్‌వుడ్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. దీంతో 27 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌ అయి.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో రెండో అతి తక్కువ స్కోర్‌ను నమోదు చేసింది. 1955లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 26 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేసింది. గ్రీన్‌ 46, స్మిత్‌ 48 పరుగులతో రాణించారు. ఇక వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 143 పరుగులకే ఆలౌట్‌ అయింది. జాన్‌ కాంబెల్‌ 36 పరుగులు, షై హోప్‌ 23 రన్స్‌ చేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 121 పరుగులకే కుప్పకూలింది. గ్రీన్‌ 42 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో షమర్‌ జోసెఫ్‌ 4, అల్జారీ జోసెఫ్‌ 5 వికెట్లతో అదరగొట్టారు. దీంతో.. వెస్టిండీస్‌ విజయంపై ఆశలు పెట్టుకుంది. కానీ, పిచ్‌ నుంచి మంచి స్వింగ్‌ లభించడంతో ఆసీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా స్టార్క్‌ అయితే వెస్టిండీస్‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ క్వీన్..!
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
ఓరి భయ్యో.! అవి పాములు.. న్యూడుల్స్ కాదు.. వీడియో చూస్తే వణుకే
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
బిగ్‌ అప్‌డేట్‌.. ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
మీ ఇంట్లో ఈ 6 మొక్కలు ఉన్నాయంటే.. దోషాలు పోయి పెళ్లి బాజాలు..
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
ఫిఫా విజేతకు రూ. 451 కోట్ల జాక్‌పాట్.. భారీగా పెరిగిన ప్రైజ్ మనీ
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
భారత్‌కు పొంచి ఉన్న ముప్పు.. సరిహద్దుల్లో డ్రాగన్ పన్నాగాన్ని..
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్