ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?
వరల్డ్ కప్‌లో కూడా ఇప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా కూడా అందరి దృష్టి మాత్రం ఇండో పాక్ మ్యాచ్ మీదే ఉంది. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండో పాక్ మ్యాచ్‌లకు ఉన్నంత భారీ క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదనేది తెలిసిందే. అలాంటి ఇండో పాక్ మ్యాచ్ మరో మూడు రోజుల్లోనే రానుంది. అయితే దానికంటే ముందు వరుణుడు కూడా రానున్నాడు. అవును.. ఇప్పుడు ఇంగ్లండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచ కప్పులో నాలుగు మ్యాచులు వర్షార్పణం […]
వరల్డ్ కప్‌లో కూడా ఇప్పుడు ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా కూడా అందరి దృష్టి మాత్రం ఇండో పాక్ మ్యాచ్ మీదే ఉంది. వరల్డ్ కప్ హిస్టరీలోనే ఇండో పాక్ మ్యాచ్‌లకు ఉన్నంత భారీ క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదనేది తెలిసిందే. అలాంటి ఇండో పాక్ మ్యాచ్ మరో మూడు రోజుల్లోనే రానుంది. అయితే దానికంటే ముందు వరుణుడు కూడా రానున్నాడు. అవును.. ఇప్పుడు ఇంగ్లండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రపంచ కప్పులో నాలుగు మ్యాచులు వర్షార్పణం అయిపోయాయి.
ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా ఇందులో ఒకటి. కివీస్ మ్యాచ్ పోయినా పర్లేదు కానీ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇలాగే వర్షానికి బలైపోతే.. అమ్మో ఈ ఊహే ఇప్పుడు క్రికెట్ ప్రేమికులకు చేదుకలగా భయపెడుతుంది. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ గానీ వర్షార్పణం అయిపోయిందంటే వరల్డ్ కప్ కళ తప్పడం ఖాయం. ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్ పేరు మీదే వందల కోట్ల బిజినెస్.. యాడ్స్ నడుస్తున్నాయి. జూన్ 16న మాంచెస్టర్‌లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.
ఆదివారం కూడా భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే ప్రముఖ వాతావరణ సంస్థ అక్యు వెదర్ వెల్లడించింది. అయితే బీబీసీ వెదర్ వాతావరణ సంస్థ అంచనా ప్రకారం ఆదివారం మాంచెస్టర్లో వర్షం పడే అవకాశాలు లేవని వెల్లడించింది. కాని ఇంగ్లండ్ లో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాగా ఈ మ్యాచ్‌పై బెట్టింగులు కట్టిన వాళ్లు.. బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.