IPL 2025: అంత మనమంచికే, వాళ్ళు మా తుప్పు రేగొట్టారు! ఓటమిపై RCB కెప్టెన్ షాకింగ్ రియాక్షన్!
RCB ఓటమిని జితేష్ శర్మ ఒక మంచి సంకేతంగా అభివర్ణించి ఆశ్చర్యానికి గురిచేశారు. SRH చేతిలో 42 పరుగుల తేడాతో ఓడిన మ్యాచ్ ద్వారా జట్టు బలహీనతలు బయటపడినాయని తెలిపారు. టిమ్ డేవిడ్ గాయం కలకలం రేపగా, కోహ్లీ-సాల్ట్ భాగస్వామ్యం ఆశాజనకంగా ఉన్నా విజయం దూరమైంది. ఓటమిని పాఠంగా తీసుకొని ప్లేఆఫ్స్‌కి ముందుగా మెరుగుపడతామని జితేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 42 పరుగుల తేడాతో ఎదురైన ఓటమిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టాండ్-ఇన్ కెప్టెన్ జితేష్ శర్మ ఒక ‘మంచి సంకేతం’గా అభివర్ణించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో ఓడిపోయినా, ఈ ఓటమి జట్టుకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పిందని జితేష్ అభిప్రాయపడ్డాడు. ప్లేఆఫ్స్‌కు ముందు జరిగిన ఈ పరాజయం బలహీనతలను వెలికితీసే అవకాశాన్ని కల్పించిందని ఆయన విశ్వసించారు.
ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది స్కోరు 231/6గా నిలవగా, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటతీరుతో 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్ల సహకారంతో హైదరాబాద్ పెద్ద స్కోరు అందుకోగలిగింది. కిషన్ ఇన్నింగ్స్‌తో పాటు SRH బౌలర్లు కూడా క్లినికల్ ప్రదర్శనతో మెరిసి పోయారు. దీనికి ప్రతిస్పందనగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ ఆరంభంలో మంచి జోరుతో ఆడినా, మిడిల్ ఆర్డర్ మెరుపులు మెరవకపోవడంతో RCB విజయం దూరంగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ స్థానంలో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన జితేష్ శర్మ, జట్టు “తుప్పుపట్టినట్లు” ఉందని పేర్కొంటూ, మొదటి ఇన్నింగ్స్‌లో తాము 20-30 పరుగులు అదనంగా ఇచ్చామని వ్యాఖ్యానించాడు. “వాళ్లు చాలా బాగా ఆడారు. వాళ్ల దాడికి నా దగ్గర సమాధానాలు లేవు. మేము తుప్పుపట్టాం. మొదట్లో ఆ తీవ్రత లేదు. కానీ డెత్ ఓవర్లలో మేము కొంత మెరుగ్గా బౌలింగ్ చేశాం,” అని జితేష్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఆయన ఈ ఓటమి ద్వారా జట్టు తప్పులపై విశ్లేషణ చేసుకొని మెరుగవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఈ మ్యాచ్ సమయంలో మరో ఘటన కూడా కలకలం రేపింది. మొదటి ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్ ప్రారంభ బంతిని ఫ్లిక్ చేయగా టిమ్ డేవిడ్ బౌండరీ తాడుకు అడ్డుపడే ప్రయత్నంలో తన తొడ కండరాలకు గాయపడ్డాడు. ఈ ఘటనపై జితేష్ మాట్లాడుతూ, “ప్రస్తుతానికి, నేను డేవిడ్‌ను కలవలేకపోయాను ఎందుకంటే నేను అవుట్ అయిన నిరాశలో ఉన్నాను,” అని అన్నారు. గాయంతో ఉన్నప్పటికీ, టిమ్ డేవిడ్ 17వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు, కానీ పరుగుల కోసం ప్రయత్నించే క్రమంలో అసౌకర్యానికి లోనయ్యాడు. చివరికి, హెన్రిచ్ క్లాసెన్‌కు షాట్ కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు.
ఇక జితేష్ శర్మ పరాజయం వల్ల ధైర్యం కోల్పోకుండా, దాన్ని ఒక ఉపాధిగా మలుచుకోవాలని ప్రయత్నించాడు. “కొన్నిసార్లు ఓటమి ఒక మంచి సంకేతంగా ఉంటుంది. ఎందుకంటే అది మిమ్మల్ని విశ్లేషించుకునేలా చేస్తుంది. మా జట్టులోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు మద్దతుగా ఉన్నారు. ఈ ఓటమి తర్వాత మేము పునర్విమర్శ చేసుకోవాలి,” అని ఆయన వ్యాఖ్యానించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



