AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 ఏళ్లుగా ఐపీఎల్ జర్నీ.. ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. 4 వికెట్లు తీయలేదు.. ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఎవరంటే?

Washington Sundar IPL records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే, ఒక భారత స్టార్ ఆల్ రౌండర్ మాత్రం వింతైన రికార్డుతో వార్తల్లో నిలిచారు. పదేళ్లుగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ, ఇప్పటివరకు కనీసం ఒక్క అర్థశతకం గానీ, ఒకే ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు గానీ సాధించలేకపోవడం గమనార్హం. ఆ ఆటగాడు మరెవరో కాదు వాషింగ్టన్ సుందర్.

10 ఏళ్లుగా ఐపీఎల్ జర్నీ.. ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. 4 వికెట్లు తీయలేదు.. ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఎవరంటే?
Washington Sundar
Venkata Chari
|

Updated on: Apr 06, 2026 | 6:55 AM

Share

Washington Sundar IPL records: ప్రస్తుతం 26 ఏళ్ల వయసున్న వాషింగ్టన్ సుందర్, కేవలం 17 ఏళ్ల ప్రాయంలోనే 2017లో ఐపీఎల్ బరిలోకి దిగాడు. తన కెరీర్ ఆరంభం నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యం ఉండటంతో ఫ్రాంచైజీలు ఇతనిపై ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటాయి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

వాషింగ్టన్ సుందర్ తన ఐపీఎల్ ప్రయాణంలో ఇప్పటివరకు నాలుగు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పూణే సూపర్ జెయింట్స్‌తో మొదలుపెట్టి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మీదుగా ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టులో కొనసాగుతున్నాడు. సుమారు 68 మ్యాచ్‌లు ఆడిన సుందర్, 47 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసే అవకాశం పొంది కేవలం 533 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 49 పరుగులు. అంటే కేవలం ఒక్క పరుగు తేడాతో తన తొలి అర్థశతకాన్ని కోల్పోయాడు.

బౌలింగ్ విషయానికి వస్తే, 64 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి కేవలం 40 వికెట్లు మాత్రమే ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడమే అతని అత్యుత్తమ ప్రదర్శన. ఏ సీజన్‌లోనూ కనీసం 10 వికెట్ల మైలురాయిని కూడా అతను చేరుకోలేకపోవడం గమనార్హం.

గుజరాత్ టైటాన్స్ ఆశలు.. రికార్డు మారుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్‌లో సుందర్ గుజరాత్ టైటాన్స్ తరపున బరిలోకి దిగుతున్నాడు. ఈ ఏడాది ఆడిన మొదటి రెండు మ్యాచ్‌లలో కేవలం 22 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే జట్టు యాజమాన్యం అతనిపై పూర్తి నమ్మకంతో ఉంది. పదేళ్లుగా ఊరిస్తున్న అర్థశతకాన్ని, నాలుగు వికెట్ల ప్రదర్శనను ఈ సీజన్‌లోనైనా సాధించి, తనపై ఉన్న ‘అన్ లక్కీ’ ముద్రను చెరిపేసుకోవాలని ఈ యువ ఆల్ రౌండర్ పట్టుదలతో ఉన్నాడు. లీగ్‌లో నిలదొక్కుకోవాలంటే కేవలం చిన్న చిన్న సహకారాలు సరిపోవని, భారీ ప్రదర్శనలు అవసరమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. 4 వికెట్లు తీయలేదు.. ఎవరీ ప్లేయర్?
ఒక్క హాఫ్ సెంచరీ లేదు.. 4 వికెట్లు తీయలేదు.. ఎవరీ ప్లేయర్?
మటన్‌ ఆ మూడు పార్ట్‎లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు
మటన్‌ ఆ మూడు పార్ట్‎లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు
“నాన్న జాగ్రత్త” అంటూ చేతిపై రాసుకుని..
“నాన్న జాగ్రత్త” అంటూ చేతిపై రాసుకుని..
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే
ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్‌గా పీఎస్ఎల్.. నఖ్వీ కామెంట్స్
ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్‌గా పీఎస్ఎల్.. నఖ్వీ కామెంట్స్
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
ఆ ముప్పు ముంచుకొచ్చింది.. రాబర్ట్ కియోసాకి సంచలన హెచ్చరిక!
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?