Video: ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా? బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త వీడియో..

|

May 21, 2024 | 1:33 PM

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేషన్ అవ్వడంతో అటు ఆటగాళ్లే కాదు.. ఇటు అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఎందుకంటే చెపాక్‌లో ఎంఎస్ ధోని ట్రోఫీని ఎత్తడం వారు కళ్లరా చూడాలని కోరుకున్నారు. ధోని మరో సీజన్ ఆడాలని యోచిస్తున్నాడో లేదో ఇంకా తెలియదు.

Video: ఆర్‌సీబీ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా ధోని తప్పు చేశాడా? బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త వీడియో..
Ms Dhoni Viral Video
Follow us on

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేషన్ అవ్వడంతో అటు ఆటగాళ్లే కాదు.. ఇటు అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఎందుకంటే చెపాక్‌లో ఎంఎస్ ధోని ట్రోఫీని ఎత్తడం వారు కళ్లరా చూడాలని కోరుకున్నారు. ధోని మరో సీజన్ ఆడాలని యోచిస్తున్నాడో లేదో ఇంకా తెలియదు. అయితే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆర్‌సీబీ ఆటగాళ్లతో ఎంఎస్ ధోని హ్యాండ్‌షేక్ చేయడంలో ఆసక్తి చూపలేదు. దీంతో కొంతమంది మాజీ క్రికెటర్లు, నిపుణులు ధోనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఇందుకు గల కారణాలపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. అయితే, తాజాగా సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

చాలా మంది RCB ఆటగాళ్ళు తమ జట్టు ప్లేఆఫ్‌‌నకు చేరడంతో సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. దీంతో ధోని కరచాలనం చేసేందుకు కొంతసేపు ఎదురుచూసి, ఆ వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చేశాడు. అయితే దీనికి విరుద్ధంగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

RCB ఆటగాళ్లకు కరచాలనం చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చేముందు ధోని చాలాసేపు వేచి ఉండలేదంటూ సోషల్ మీడియాలో ఓ అభిమాని కామెంట్ చేశాడు.

హ్యాండ్‌షేక్‌కి ముందు ఎంఎస్ ధోనీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వనందుకు RCB ఆటగాళ్లను హర్ష భోగ్, మైఖేల్ వాన్ వంటివారు విమర్శించారు.

“ఆటగాళ్ల బృందం సెలబ్రేట్ చేసుకునేందుకు సమయం చాలానే ఉంది. కానీ, అది ఎంఎస్ ధోని చివరి గేమ్. ఆర్‌సీబీ ఆటగాళ్ళు మైదానం చుట్టూ హ్యాండ్‌స్టాండ్‌లు చేస్తూ పరిగెత్తారు. వారికి కావలసిందల్లా లెజెండ్‌ను కలవడమే. కానీ, అందుకు విరుద్దంగా చేశారు. వాళ్లంతా వెళ్లి ధోనికి కరచాలనం చేయాల్సి ఉంది” అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్రిక్‌బజ్‌లో చెప్పుకొచ్చాడు.

అత్యంత ప్రసిద్ధ వ్యాఖ్యాతలలో ఒకరైన హర్ష, ధోనీకి కరచాలనం చేయడం మర్చిపోయిన RCB ఆటగాళ్లు తమ వేడుకల్లో మునిగిపోవడంపై విచారం వ్యక్తం చేశాడు.

“ఇదేం బాగోలేదు. ప్రపంచకప్ ఫైనల్‌లో గెలిచిన జట్టు, భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. కానీ, ప్రత్యర్థితో కరచాలనం చేయకుండా ఉండకూడదు. అప్పుడే, ఇరుజట్ల విరోధం ముగిసిందనే సంకేతం ఇస్తుంది’ అంటూ భోగ్లే చెప్పుకొచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..