టీ20ల్లో టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నమోదు చేసిన ఓ అరుదైన రికార్డు బ్రేక్ అయింది. తాజాగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్ 35 బంతుల్లో 40 పరుగులు చేయగా.. తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు బాదాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.
మొదటి స్థానంలో ఉన్న కోహ్లీని అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు స్టిర్లింగ్ 288 ఫోర్లు కొట్టగా.. విరాట్ కోహ్లీ 285 ఫోర్లు సాధించాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్(256) మూడో స్థానంలో.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(252) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.
Most fours in men’s T20I cricket
1️⃣ Paul Stirling: 288
2️⃣ Virat Kohli: 285
3️⃣ Martin Guptill: 256
4️⃣ Rohit Sharma: 252Congratulations, Stirlo! Another record broken ?@ITWSports pic.twitter.com/ChHKsaxdDs
— Cricket Ireland (@cricketireland) October 10, 2021
Read Also: సమంతపై వస్తోన్న రూమర్స్‌పై నాగ చైతన్య స్పందించాలి: సామ్ స్టైలిస్ట్ ప్రీతమ్
ఈ ఫోటోలో సింహాన్ని గుర్తించండి.. కనిపెట్టండి అంత ఈజీ కాదు.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
భారీ పామును చెడుగుడు ఆడుకున్న కుక్క.. మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
135 పరుగుల టార్గెట్.. ఈ బ్యాట్స్‌మెన్ ఒక్కడే ఒంటరిగా సెంచరీతో కదంతొక్కాడు.. ఎవరో తెలుసా?